బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఏడో స్థానంలో తెలంగాణ..

By AN TeluguFirst Published Aug 3, 2021, 4:32 PM IST
Highlights


తెలంగాణ కంటే అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో గుజరాత్ 6,846, ఆంధ్రప్రదేశ్ 4,209, తమిళనాడు 4,075, కర్ణటక 3,648, రాజస్థాన్ 3,536 కేసులు నమోదయ్యాయి. 

బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఏడో స్థానంలో నిలిచిందని, గత నెల 28వ తేదీ నాటికి 2,578 కేసులు నమోదయ్యాయని, అత్యధికంగా మహారాష్ట్రలో 9,654 బాధితులు ఫంగస్ బారినపడ్డారని తెలిపింది.

తెలంగాణ కంటే అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో గుజరాత్ 6,846, ఆంధ్రప్రదేశ్ 4,209, తమిళనాడు 4,075, కర్ణటక 3,648, రాజస్థాన్ 3,536 కేసులు నమోదయ్యాయి. 

బ్లాక్ ఫంగస్ కేసులు అతి తక్కువగా నమోదైన రాష్టాల్లో నాగాలాండ్, త్రిపుర ఒకటి చొప్పున, మణిపూర్ 7, అసోం 10, గోవా 30, హిమాచల్ ప్రదేశ్ 31, జమ్మూ కాశ్మీర్ 47 ఉన్నాయని తెలిపింది. బ్లాక్ ఫంగస్ కేసులు దేశంలో మే రెండో వారం తరువాత ఎక్కువయ్యాయనీ, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరినారికి ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్లు ఇవ్వడం వల్ల షుగర్ పెరగడం తదితర కారణలతో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువయ్యాయని తెలిపింది. 

click me!