తెలంగాణలో స్వతంత్రులే కింగ్‌మేకర్లు: లగడపాటి సంచలన సర్వే

By sivanagaprasad KodatiFirst Published Nov 30, 2018, 12:54 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన సర్వే వివరాలు రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం సర్వే వివరాలను వెల్లడించిన రాజగోపాల్.. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో  ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లోనుకావడం లేదని తెలిపారు.. 

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన సర్వే వివరాలు రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం సర్వే వివరాలను వెల్లడించిన రాజగోపాల్.. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో  ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లోనుకావడం లేదని తెలిపారు..

ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపే జనం మొగ్గు చూపుతారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్రులు గెలవబోతున్నారని స్పష్టం చేశారు. నారాయణ్‌పేట్‌, భోథ్‌లో ఇండిపెండెంట్లు గెలుస్తారని లగడపాటి తేల్చారు.

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న జాదవ్ అనిల్ కుమార్ స్వతంత్రులుగా గెలుస్తారని రాజగోపాల్ జోస్యం చెప్పారు.

రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు వెల్లడిస్తానని లగడపాటి వెల్లడించారు. దీనిని బట్టి వారికి వారికి ప్రజల్లో ఏ స్థాయిలో పట్టుందో అర్థమవుతోందని రాజగోపాల్ అన్నారు. తనకు రాజకీయాలతోనూ పార్టీలతోనూ సంబంధం లేదని ఆయన తేల్చారు.

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై

నిజమా?: మల్కాజిగిరి నుంచి లగడపాటి లడాయి

తెలంగాణలో పోటీకి లగడపాటి సై, పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలు

లగడపాటి సర్వేపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అది తన సర్వే కాదంటున్న లగడపాటి

లగడపాటి ఎన్నికల సర్వే.. ఎప్పుడంటే..

లగడపాటి సర్వే: 7 శాతం తగ్గనున్న వైసీపీ ఓట్లు, జనసేనతో వైసీపీకి దెబ్బేనా?

టిడిపికి 110 సీట్లు, వైసీపీకి 60, పవన్ కి నామమాత్రమే: లగడపాటి సర్వే

click me!