ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో బిఆర్ఎస్ పార్టీలో అలజడి రేగింది. సీటు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇలా కరీంనగర్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ కూడా బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు.
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ షాక్ ఇచ్చారు. కరీంనగర్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ టికెట్ ఆశించారు సంతోష్. అయితే బిఆర్ఎస్ అదిష్టానం మాత్రం మళ్లీ గంగుల కమలాకర్ కే టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్సీ తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసాడు.
2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సంతోష్ తెలిపారు. అయితే చేరిక సమయంలో పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తానని కేసీఆర్ చెప్పారని... కానీ ఏనాడూ తనకు తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. తనలాగే ఇంకా చాలామంది బిఆర్ఎస్ నాయకులు అసంతృప్తితో వున్నారని మాజీ ఎమ్మెల్సీ తెలిపారు. రాష్ట్రస్థాయి పెద్దలే కాదు జిల్లా, స్థానిక నాయకులు సైతం తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బాధ కలిగించిందని...అందువల్లే పార్టీకి రాజీనామా చేసానని సంతోష్ వెల్లడించాడు.
undefined
వీడియో
కరీంనగర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... వారికి సేవ చేయడానికి తాను ముందుకు వస్తున్నానని సంతోష్ అన్నారు. కరీంనగర్ ప్రజల ఆశిస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేసారు. అయితే ఏ పార్టీ నుండి పోటీచేసేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. పది పదిహేను రోజులు అనుచరులు, సన్నిహితులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ వెల్లడించారు.
Read More కేసీఆర్ కుటుంబం అమరవీరుల రక్తపు కూడు కూడా తింటుంది..: జూపల్లి కృష్ణారావు
సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని... ప్రజా నాయకుడిగా మాత్రమే గుర్తింపు పొందానని సంతోష్ అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇస్తానంటే చేరడానికి సిద్దంగా వున్నానని అన్నారు. ఏదేమైనా ఈసారి కరీంనగర్ బరిలో దిగడం ఖాయమని సంతోష్ స్పష్టం చేసారు.
2018లో బిఆర్ఎస్ లో చేరి కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు కృషి చేసానని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ అన్నారు. అంతేకాదు మున్సిపల్ ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించానని అన్నారు. ఇలా పార్టీకోసం ఎంత పనిచేసినా సరైన గుర్తింపు లభించలేదన్నారు. చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ తనకు అవకాశం కల్పించలేదని... అందువల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు.