ఘట్‌కేసర్ శ్రీనిధి కాలేజీ వద్ద ఉద్రిక్తత:విద్యార్థులు, పేరేంట్స్ ఆందోళన

By narsimha lode  |  First Published Aug 23, 2023, 2:05 PM IST

హైద్రాబాద్ శివారులోని ఘట్ కేసర్ శ్రీనిధి కాలేజీ వద్ద  బుధవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది.  తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని  బాధిత విద్యార్థులు కోరుతున్నారు.
 



హైదరాబాద్: నగర శివారు ఘట్‌కేసర్ లో గల  శ్రీనిధి కాలేజీ వద్ద  బుధవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది.  కాలేజీ వద్ద  విద్యార్థులు,  విద్యార్థులు ఆందోళనకు దిగారు.  శ్రీనిధి యూనివర్శిటీకి అనుమతి లేకున్నా ఆడ్మిషన్లు తీసుకుని  మోసం చేశారని విద్యార్థులు. వారి పేరేంట్స్  గత కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  ఈ ఆందోళనల కారణంగా  శ్రీనిధి యూనివర్శిటీ నుండి  విద్యార్థుల ఆడ్మిషన్లను  కాలేజీలోకి మారుస్తామని  చెప్పి  ఇంతవరకు మార్చలేదని  బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై కాలేజీ యాజమాన్యంతో  గతంలో  జరిగిన  ఒప్పందం  మేరకు   ఆడ్మిషన్లు జరగలేదని చెబుతున్నారు. ఈ విషయమై కాలేజీ యాజమాన్యం  స్పందించడం లేదన్నారు. దీంతో  విద్యార్థులు,వారి తల్లిదండ్రులు  కాలేజీ  వద్దకు చేరుకున్నారు. అయితే కాలేజీలోకి విద్యార్థులను. పేరేంట్స్ ను అనుమతించలేదు. దీంతో  కాలేజీ ముందు బైఠాయించి  వారు ఆందోళనకు దిగారు.   

ఇదిలా ఉంటే   బాధితులకు  సంఘీభావం తెలిపేందుకు  వచ్చిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను  పోలీసులు  అరెస్ట్  చేశారు. శ్రీనిధి యూనివర్శిటీ నుండి  కాలేజీలోకి ఆడ్మిషన్లను మార్చాలని  ఈ ఏడాది జూలై  31న విద్యార్థులు ఆందోళన చేశారు.  కాలేజీలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. వారం రోజుల క్రితం  ఓ విద్యార్థి కాలేజీ  నుండి కిందకు దూకుతానని బెదిరించారు. ఇతర విద్యార్థులు అతడికి నచ్చజెప్పి కిందకు  తీసుకు వచ్చారు.  గతంలో  విద్యార్థులు, పేరేంట్స్ తో  కాలేజీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాలను  అమలు చేయాలని బాధిత విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

Latest Videos

 

click me!