స్పీకర్ కార్యాలయానికి ఈటల:ఈ నెల 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా

Published : Jun 11, 2021, 12:34 PM ISTUpdated : Jun 11, 2021, 12:39 PM IST
స్పీకర్ కార్యాలయానికి ఈటల:ఈ నెల 12న ఎమ్మెల్యే పదవికి  రాజీనామా

సారాంశం

ఈ నెల12న ఎమ్మెల్యే పదవికి  ఈటల రాజేందర్రా జీనామా చేయనున్నారు.  గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామాను సమర్పించనున్నారు. 

హైదరాబాద్:ఈ నెల12న ఎమ్మెల్యే పదవికి  ఈటల రాజేందర్రా జీనామా చేయనున్నారు.  రాజీనామా చేయనున్నారు.  గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత స్పీకర్ కార్యాలయానికి వెళ్లి  ఆయన రాజీనామాను సమర్పించనున్నారు. గత వారంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా సమర్పించారు.  అదే రోజున ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా సమర్పిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

 

also read:ఇక దూకుడే:హుజూరాబాద్‌పై టీఆర్ఎస్ ఫోకస్, పైచేయి కోసం ప్లాన్

టీఆర్ఎస్ కు రాజీనామా సమర్పించిన తర్వాత నియోజకవర్గంలో రెండు రోజుల పాటు అనుచరులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని ఆయన హైద్రాబాద్ చేరుకొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఇవాళ హైద్రాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత   బీజేపీ నేతలు ఈటల రాజేందర్ తో భేటీ కానున్నారు.

ఈ నెల 12వ తేదీన ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఈ నెల 14న ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ తుల ఉమలు కూడ బీజేపీలో చేరనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?