అనుమానం పెనుభూతమై... భార్యను రోకలిబండతో మోది చంపిన తాగుబోతు భర్త

Arun Kumar P   | Asianet News
Published : Jun 11, 2021, 12:28 PM ISTUpdated : Jun 11, 2021, 12:33 PM IST
అనుమానం పెనుభూతమై... భార్యను రోకలిబండతో మోది చంపిన తాగుబోతు భర్త

సారాంశం

మద్యం మత్తులో గొడవకు దిగిన భర్త కోపంతో ఊగిపోతూ రోకలిబండతో బాది భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. 

సిరిసిల్ల: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ తాగుబోతు భర్త దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో గొడవకు దిగిన భర్త కోపంతో ఊగిపోతూ రోకలిబండతో బాది భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన భార్యాభర్తలు నిత్యం గొడవపడేవారు. తాగుడుకు బానిసైన భర్త మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యను వేధించేవాడు. ఇది చాలదన్నట్లు ఈ మధ్య భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో నిత్యం దుర్భాషలాడుతూ భార్యను చిత్ర హింసలకు గురిచేసేవాడు. 

read more  సొంత చెల్లిపైనే అత్యాచారయత్నానికి పాల్పడి... ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు (వీడియో)

ఇలా గురువారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. ఇలా అర్ధరాత్రి వరకు గొడవ కొనసాగింది. ఈ క్రమంలో భార్యపై కోపంతో రగిలిపోయిన సదరు తాగుబోతు రోకలిబండతో ఆమెపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.  

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు పరారీలో వున్నట్లు... అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?