టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

By narsimha lodeFirst Published Jun 11, 2021, 12:15 PM IST
Highlights

: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో శుక్రవారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 1064 కోట్ల బ్యాంక్ నిధుల కుంభకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో శుక్రవారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 1064 కోట్ల బ్యాంక్ నిధుల కుంభకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.నామా నాగేశ్వరరావు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు ఆయన ఇంట్లో కూడ సోదాలు నిర్వహిస్తున్నారు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాటిని విదేశీ కంపెనీలకు నిధులను మళ్లించారిని ఆయనపై అభియోగాలున్నాయి.

దేశంలోని ఏడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని మధుకాన్ ఇన్‌ఫ్రా కార్యాలయంతో పాటు ఖమ్మంలోని ఆయన నివాసంలో రాంచీ ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ కార్యాలయంతో పాటు మధుకాన్ డైరెక్టర్లు ఎన్ సీతయ్య,ఎన్. ఫృథ్వీ ల నివాసాల్లో కూడ  ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

 

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో శుక్రవారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 1064 కోట్ల బ్యాంక్ నిధుల కుంభకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.నామా నాగేశ్వరరావు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు ఆయన ఇంట్లో కూడ సోదాలు నిర్వహిస్తున్నారు. pic.twitter.com/f9J9vgRpZW

— Asianetnews Telugu (@AsianetNewsTL)

2019 లో సీబీఐ అధికారులు నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2020లో రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ తో పాటు డైరెక్టర్లపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది.మధుకాన్ ప్రాజెక్టు, మధుకాన్ ఇన్ ఫ్రా ,మధుకాన్ టాలీ హైవే అధారిటీ తదితరులపై ఎఫ్‌ఐఆర్ లో చేర్చింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకులు ఈ కంపెనీలకు రూ. 1151 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.  ఈ నిధుల ద్వారా రాంచీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం వినియోగించాలని తలపెట్టారు. 

అయితే ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో పురోగతి లేదని సీబీఐ ఆరోపించింది. అంతేకాదు రూ. 1029 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సీబీఐ ప్రాథమిక నిర్ధారించింది. ఈ లోన్ నాన్ ఫెర్మారింగ్ అసెట్ గా మారిందని 2018లో సీబీఐ తెలిపింది. 2019లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రాంచీ ఎక్స్ ప్రెస్ వే నుండి ఈ కంపెనీని తొలగించింది.


 

click me!