Huzurabad Bypoll: దళిత బంధుపై ఆయనతో పిర్యాదు చేయించిందే టీఆర్ఎస్..: విజయ రామారావు సంచలనం

By Arun Kumar PFirst Published Oct 19, 2021, 3:07 PM IST
Highlights

ఎన్నికల సంఘం హుజురాబాద్ లో దళిత బంధును నిలిపివేయడానికి అధికార టీఆర్ఎస్ పార్టీయే కారణమని తెలంగాణ బిజెపి ఉపాధ్యక్షులు విజయ రామారావు ఆరోపించారు. 

కరీంనగర్: హుజురాబాద్ లో ఎన్నిక ముగిసేవరకు దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల సంఘం (EC) ఆదేశాలతో రాజకీయాలు ఒక్కసారగా వేడెక్కాయి. ఇందుకు మీరంటే మీరని రాష్ట్రంలో అధికారంలో వున్న TRS, కేంద్రంలో అధికారంలో వున్న BJP ఆరోపించుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ బిజెపి ఉపాధ్యక్షులు విజయ రామారావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ పద్మనాభ రెడ్డితో దళిత బంధుపై పిర్యాదు చేయించింది టీఆర్ఎస్ పార్టీయే అంటూ vijaya ramarao సంచలన వ్యాఖ్యలు చేసారు. 

''ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి dalit bandhu అమలు చేసే పరిస్థితిలో వుంది. కానీ huzurabad Bypoll లో తన పార్టీ TRS ను గెలిపించుకోవాలంటే దళితుల ఓట్లు కావాలి. అందుకోసమే దళిత బంధును తానే ప్రారంభించి తిరిగి తానే ఆగిపోయేలా చేసారు. కేసీఆర్ దళిత బంధు అపిస్తాడని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు తెలుసు'' అని విజయ రామారావు ఆరోపించారు.

''దళిత బంధును మొదట స్వాగతించింది బిజెపి పార్టీ. అయితే కేవలం హుజురాబాద్ లోనే కాదు రాష్ట్రమంతా అమలు చేయాలని కోరాం. దళిత బంధును తాము ఆపించాం అంటున్నారు... మరి రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల ఇవ్వద్దని కూడా ఎవరయినా ఫిర్యాదు చేశారా... అందుకే ఇవ్వలేదా..'' అంటూ ఎద్దేవా చేసారు. 
 
''హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సిఎం కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు కేటీఆర్ కు తెలుసు. అందువల్లే బిజెపికి ఓటు వేస్తాం అని చెప్తే టీఆర్ఎస్ వాళ్ళు బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా హుజురాబాద్ ప్రజలే చెప్తున్నారు'' అన్నారు విజయ రామారావు.

READ MORE  Huzurabad Bypoll: మళ్ళీ దగాపడ్డ దళితులు... సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే: బండి సంజయ్ డిమాండ్

అయితే  దళిత వ్యతిరేక పార్టీలు కేసీఆర్ సర్కార్ దళిత బంధు పథకం ద్వారా నిరుపేదలకు డబ్బులివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈసికి ఫిర్యాదు చేసాయని టీఆర్ఎస్ ఆరోపిస్తొంది. బిజెపి నాయకుల ఫిర్యాదు వల్లే ఈసీ ఈ పథకాన్ని నిలిపివేసిందని టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దళితులు ఆర్ధికంగా సహాయం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను  దళిత వ్యతిరేకులు అడ్డుకొంటున్నారని టీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. 

 ఇలా దళిత బంధు నిలుపుదలపై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. కానీ ఇరు పార్టీల రాజకీయాల వల్ల హుజురాబాద్ లోని దళితులు నలిగిపోతున్నారు. దళిత బంధు డబ్బులతో తమ జీవితాలు మారతాయన్న నిరుపేద దళితులపై ఈసీ నిర్ణయం నీల్లుచల్లినట్లయ్యింది. 

జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో వరదల్లో నష్టపోయిన వారికి పదివేలు ఇస్తుంటే ఈసీ అడ్డుకుంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం పదివేల పంపిణీ ఊసే ఎత్తలేదు. ఎక్కడ దళిత బంధు పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ కు ముందే దళిత బంధు డబ్బులు డ్రా చేసుకోడానికి బ్యాంకుల ముందు బారులు తీరారు. కానీ దళిత బంధు డబ్బులను నేరుగా విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో ఉసూరుమన్నారు.  తాజాగా ఈసీ దళిత బంధు పథకాన్ని నిలిపివేయడంతో దళిత ప్రజలు ఒకింత ఆందోళనలో వున్నారని చెప్పాలి.

click me!