Huzurabad Bypoll: బిజెపి, టీఆర్ఎస్ శ్రేణుల భాహాభాహీ... జమ్మికుంటలో ఉద్రిక్తత

By Arun Kumar PFirst Published Oct 19, 2021, 2:02 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘం దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం టీఆర్ఎస్, బిజెపి శ్రేణుల్లో చిచ్చు రాజేసింది. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళిత బంధు పథకాన్ని ఎన్నికల సంఘం నిలిపివేయడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమంటూ బిజెపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. వీరికి టీఆర్ఎస్ శ్రేణులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

BJP శ్రేణులు KCR దిష్టిబొమ్మనం దహనం చేయడానికి ప్రయత్నిస్తుండగా TRS వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ఒకరిపైకి ఒకరు వచ్చారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంత మారేలా కనిపించడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కొరపల్లిలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసారు.

ఇదిలావుంటే huzurabad లో dalit bandhu ను ఎన్నికల సంఘం నిలిపివేయడం మీవల్లే అంటే మీవల్లే అంటూ టీఆర్ఎస్, బిజెపిలు ఆరోపించుకుంటున్నాయి. దళిత వ్యతిరేక పార్టీలు కేసీఆర్ సర్కార్ దళిత బంధు పథకం ద్వారా నిరుపేదలకు డబ్బులివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈసికి ఫిర్యాదు చేసాయన్నారు. దీంతో ఈసీ ఈ పథకాన్ని నిలిపివేసిందని టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దళితులు ఆర్ధికంగా సహాయం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను  దళిత వ్యతిరేకులు అడ్డుకొంటున్నారని టీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. 

READ MORE  Huzurabad Bypoll: మళ్ళీ దగాపడ్డ దళితులు... సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే: బండి సంజయ్ డిమాండ్

బిజెపి మాత్రం ఉపఎన్నిక సందర్భంగా ఈసి ఎలాగూ అడ్డుకుంటుంది కాబట్టే ఇక్కడ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం వల్లే దళితులకు దళిత బంధు అందడం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. దళితబంధు పథకాన్ని నిలిపివేయించి... దాన్ని ఇతరులపై నెట్టాలని కేసీఆర్ ముందుగానే కుట్ర పన్నారని... అందులో భాగంగానే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. 

ఇలా దళిత బంధు నిలుపుదలపై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. కానీ ఇరు పార్టీల రాజకీయాల వల్ల హుజురాబాద్ లోని దళితులు నలిగిపోతున్నారు. దళిత బంధు డబ్బులతో తమ జీవితాలు మారతాయన్న నిరుపేద దళితులపై ఈసీ నిర్ణయం నీల్లుచల్లినట్లయ్యింది. 

READ MORE  కొంపదీసి ఆ బాగోతంలో మీరూ భాగస్వాములేనా?: కేటీఆర్ కు రేవంత్ ట్వీట్

జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో వరదల్లో నష్టపోయిన వారికి పదివేలు ఇస్తుంటే ఈసీ అడ్డుకుంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం పదివేల పంపిణీ ఊసే ఎత్తలేదు. ఎక్కడ దళిత బంధు పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ కు ముందే దళిత బంధు డబ్బులు డ్రా చేసుకోడానికి బ్యాంకుల ముందు బారులు తీరారు. కానీ దళిత బంధు డబ్బులను నేరుగా విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో ఉసూరుమన్నారు.  తాజాగా ఈసీ దళిత బంధు పథకాన్ని నిలిపివేయడంతో దళిత ప్రజలు ఒకింత ఆందోళనలో వున్నారని చెప్పాలి.

click me!