కేసీఆర్ పై ఈటల గెలుపు... వేములవాడ రాజన్నకు నిలువెత్తు బంగారం సమర్పించిన అభిమాని

By Arun Kumar PFirst Published Dec 3, 2021, 12:58 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు నేపథ్యంలో ఆయన అనుచరుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కు చెల్లించుకున్నాడు. 

కరీంనగర్: ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించి ఈటల రాజేందర్ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈటల కేవలం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను కాదు సీఎం కేసీఆర్ నే ఓడించాడంటూ చర్చ జరిగిందంటేనే హుజురాబాద్ ఫలితం తెలంగాణ రాజకీయాలను ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కీలకమైన ఎన్నికలో ఈటల అభిమానులు, అనుచరులు, బిజెపి శ్రేణులు గెలుపుకోసం కష్టపడటమే కాదు దేవుళ్లకు మొక్కులు కూడా మొక్కుకున్నారు. భారీ మెజారిటీతో ఈటల గెలవడంతో దేవుళ్లకు మొక్కులు తీర్చుకుంటున్నారు. 

తాజాగా కమలాపురం మండలం గూడూరు గ్రామానికి చెందిన ఈటల అనుచరుడు బండి వినయ్ సాగర్ వేములవాడ రాజన్నకు మొక్కు తీర్చుకున్నాడు. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడి బిజెపి గెలిస్తే ఈటల నిలువెత్తు బంగారం సమర్పిస్తానని వినయ్ రాజరాజేశ్వస్వామిని మొక్కుకున్నాడు. తాజాగా ఈ మొక్కును తీర్చుకున్నాడు. 

గురువారం huzurabad ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో eatala rajender ను కలిసిన వినయ్ ఆయన బరువుతో సరితూగే బెల్లం సేకరించాడు. శుక్రవారం వేములవాడకు చేరుకున్న వినయ్ రాజన్నను దర్శించుకుని ఈటలతో సరితూగిన 56కిలోల బెల్లంను(నిలువెత్తు బంగారం) స్వామికి సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు.  

ఇదిలావుంటే ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొందరు కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకన్నకు మొక్కు తీర్చుకునేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా కరీంనగర్ నుండి తిరుమలకు దాదాపు 700కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. 

video కేసీఆర్ మీద ఫైట్: బిజెపి బీసీ వ్యూహం, ఈటల రాజేందర్ తురుపుముక్క 

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం నుండి నవంబర్ పదవ తేదీన పాదయాత్ర మొదలయ్యింది. సుమారు ఏడు వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్లి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. రాజా రెడ్డితో పాటు కరుణాకర్ గౌడ్, సుభాష్ గౌడ్, నిఖిల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సాయి మహేందర్ గౌడ్, హేమంత్ గౌడ్, సాయి గౌడ్, ప్రవీణ్ సాగర్ యాదవ్, మహేష్ యాదవ్ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 

ఇక హుజురాబాద్ ఉపఎన్నిక విజయం తర్వాత ఈటల రాజేందర్ కూడా దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవల భద్రాచలం సీతారామస్వామి ఆలయానికి వెళ్లిన ఈటల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. BJP Leaders తో కలిసి  bhadrachalam seetharamachandra swamy దేవాలయానికి చేరుకున్న eatal rajender ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన గెలుపుకోసం ప్రార్థించిన భక్తుల తరపున ఈటల మొక్కులు చెల్లించుకున్నారు.  

read more  కేసీఆర్ అహంకారం ఓడినందుకు మొక్కు చెల్లింపు...: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈటల కామెంట్స్ (వీడియో)

అలాగే వనదేవతలు సమక్క సారలమ్మలను కూడా ఈటల దర్శించుకున్నారు. బిజెపి నాయకులతో కలిసి మేడారం చేరుకుని అమ్మవారి గద్దెలను దర్శించుకున్నారు. ఎన్నికల సమయంలో గెలుపుకోసం  వనదేవతలను మొక్కుకున్న ఈటల ఇటీవల ఆ మొక్కులు చెల్లించుకున్నారు. 

ఇక ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలోని బత్తువాని పల్లి గ్రామానికి ఈటల మొదటిసారి వెళ్లిన ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలోని హనుమాన్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కరిస్తానని ఈటల గ్రామస్తులకు హామీ ఇచ్చారు.  


 

click me!