వరిధాన్యం కొనుగోలుపై తెలంగాణ సర్కార్ రాజకీయం: రాజ్యసభలో పీయూష్ గోయల్

By narsimha lodeFirst Published Dec 3, 2021, 12:56 PM IST
Highlights

వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. శుక్రవారం నాడు రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

న్యూఢిల్లీ: వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు.  యాసంగిలో తమ రాష్ట్రం నుండి బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయాలని టీఆర్ఎస్  పార్లమెంటరీ పక్ష నేత కె. కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రశ్నకు  Rajya sabhaలో మంత్రి  Piyush Goyal సమాధానం చెప్పారు.ప్రతి ఏటా Paddy ధాన్యం కొనుగోళ్లను పెంచుకొంటూ పోతున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

శుక్రవారం నాడు రాజ్యసభలో కె. కేశవరావు  వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టత కోరారు. కేశవరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు.  వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది.ఇవాళ ఈ విషయమై టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఎంఓయూ ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఖరీఫ్ సీజన్ ద్వారా యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై  ఆలోచిద్దామని మంత్రి రాజ్యసభలో తేల్చి చెప్పారు.అన్ని రాష్ట్రాలతో వరి ధాన్యం కొనుగోలు విషయమై ఎంఓయూలు చేసుకొంటామని ఆయన గుర్తు చేశారు. దీని ప్రకారంగానే తాము ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ ఇచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తు చేశారు. గతంలో లేఖ ఇచ్చి ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనాలని కోరడం సరైంది కాదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ సీజన్ లో ఇస్తామన్న ధాన్యం కూడా ఇంకా ఇవ్వలేదన్నారు. ఇంకా 29 లక్షల ధాన్యం పెండింగ్ లో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. వరి లెక్కలను తెలంగాణ ప్రభుత్వం సరిగా నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు.

also read:డిమాండ్ ఉన్న పంట‌లే వేయండి... పోలాల్లో కాలినడక, రైతులకి కేసీఆర్ సూచనలు

ఇదే విషయమై మంత్రి సమాధానానికి ముందు, ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు,  కెఆర్ సురేష్ రెడ్డిలు ప్రసంగించారు.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తాయని టీఆర్ఎస్ ఎంపీ  కేశవరావు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గింజ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఓ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను టీఆర్ఎస్ ఎంపీ కేకే మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని మంత్రికి చూపారు.గత ఏడాది 94 లక్షల మెట్రిక్ టకన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందన్నారు.ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని కేశవరావు కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఎంత కొంటారో కేంద్రం చెప్పాలని కేశవరావు డిమాండ్ చేశారు.  అంతేకాదు రకాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 60 శాతం వరి సాగరు విస్తీర్ణం పెరిగిన విషయాన్ని కేశవరావు గుర్తు చేశారు. మరో వైపు ఇదే విషయమై మరో టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కూడా మాట్లాడారు. రెండేళ్లకు సరిపడు బాయిల్డ్ రైస్ ను సరఫరా చేసేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్దంగా ఉందని సురేష్ రెడ్డి చెప్పారు. 

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల తర్వాత రబీ సంగతి చూద్దామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనపై  మరో టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి స్పందించారు.యాసంగి పంట వేయకముందే రైతులకు వరి ధాన్యం వేయాలా వద్దా అనే విషయమై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్పష్టత ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రులే పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని ఎంపీ సురేష్ రెడ్డి గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ఎంపీ సురేష్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

click me!