పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద విపక్ష ఎంపీల ఆందోళన: పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు

By narsimha lodeFirst Published Dec 3, 2021, 12:10 PM IST
Highlights

పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు.ఈ ఆందోళనలో టీఆరఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: రాజ్యసభ నుండి 12 మంది ఎంపీ సస్పెన్షన్ ను నిరసిస్తూ విపక్షాలు శుక్రవారం నాడు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఆ:దోళనకు దిగాయి.ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు.Paddy  ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా Trs  ఎంపీలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.Parliament శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే Rajya sabha లో 12 మంది విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సభ కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారనే నెపంతో రాజ్యసభ నుండి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. గురువారం నాడు కూడా గాంధీ విగ్రహం ముందు విపక్ష పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

పార్లమెంట్ సమావేశాల్లో వరి ధాన్యంపై తాడోపేడో తేల్చుకొంటామని టీఆర్ఎస్ తేల్చి చెప్పింది. వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు చేస్తున్నారు. ఇవాళ ఈ విషయమై టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు తర్వాత యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై ఆలోచిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. 

 గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఎంపీల నిరసన

12 మంది ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ లోని మహత్మాగాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నిరసనను కొనసాగిస్తున్న సమయంలో బీజేపీకి చెందిన ఎంపీలు కూడా అదే స్థలంలో నిరసనలు దిగారు. విపక్ష ఎంపీలు రాజ్యసభలో వ్యవహరించిన అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ బీజేపీ ఎంపీలు  ఆందోళన నిర్వహించారు.

click me!