ఢిల్లీ లిక్కర్ స్కాం: శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు

By narsimha lode  |  First Published Jan 27, 2023, 12:24 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  శరత్ చంద్రారెడ్డికి సీబీఐ ప్రత్యేక  కోర్టు  ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.  



న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  శరత్ చంద్రారెడ్డికి   రౌస్ ఎవెన్యూ కోర్టు  శుక్రవారం నాడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  14 రోజుల పాటు  శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది  కోర్టు . తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  బెయిల్ మంజూరు చేయాలని శరత్ చంద్రారెడ్డి  కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.   దీంతో   శరత్ చంద్రారెడ్డికి  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది  కోర్టు . రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో  శరత్ చంద్రారెడ్డికి  కోర్టు  బెయిల్ మంజూరు చేసింది. 

2022  నవంబర్  09 వ తేదీన  శరత్ చంద్రారెడ్డిని  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను  మూడు రోజులుగా విచారించిన ఈడీ అధికారులు  వారిని  ఒకే రోజున అరెస్ట్  చేశారు.  విచారణకు సహకరించడం లేదని  ఈడీ అధికారులు వీరిని అరెస్ట్  చేశారు.  ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు  పలు  సంస్థల్లో  శరత్ చంద్రారెడ్డికి  భాగస్వామ్యం ఉంది.   ఢిల్లీ లిక్కర్ స్కాంలో  దక్షిణాది రాష్ట్రాలకు  చెందిన  వారి పాత్ర ఉందని సీబీఐ అనుమానిస్తుంది.  ఈ క్రమంలోనే  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో  సీబీఐ, ఈడీ అధికారులు  గత ఏడాదిలో  పలుమార్లు సోదాలు నిర్వహించారు. 

Latest Videos

గత ఏడాదిలో హైద్రాబాద్ లోని  ప్రముఖ ఆడిటర్  నివాసంలో  సోదాలు నిర్వహించిన సమయంలో   ఈడీ అధికారులు  కీలకసమాచారం సేకరించినట్టుగా సమాచారం.ఈ సమాచారం ఆధారంగా  ఈడీ అధికారులు  విచారించారు. ఈ సమాచారం ఆధారంగానే  ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగించారు. పలువురిని అరెస్ట్  చేశారు.  

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ ఎదుట హాజరైన కనికా రెడ్డి, జెట్ సెట్‌గో వివరాలు అందజేత

జైల్లో  ఉన్న ఈ  నెల  2వ తేదీన శరంత్ చంద్రారెడ్డి సహా పలువురికి   రిమాండ్  ను పొడిగించింది కోర్టు.శరత్ చంద్రారెడ్డి నానమ్మ మరణించినందున ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  వీలుగా  బెయిల్ మంజూరు చేయాలని శరత్ చంద్రారెడ్డి  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  ఈ విషయమై వాదనలు విన్న  కోర్టు  శరత్ చంద్రారెడ్డికి  మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ  ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.  
 

click me!