సొంత గూటికి: రాహుల్ గాంధీతో డిఎస్ భేటీ

By pratap reddyFirst Published Oct 27, 2018, 10:38 AM IST
Highlights

డిఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కోరారు. ఆయనతో నర్సారెడ్డి, రాములు నాయక్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరారు.

న్యూఢిల్లీ: సొంత గూటికి చేరుకునే క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజసభ సభ్యుడు డి. శ్రీనివాస్ శనివారం ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. డిఎస్ కాంగ్రెసులో చేరుతారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. 

డిఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కోరారు.నర్సారెడ్డి, రాములు నాయక్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరారు.

తమ పార్టీలో చేరిన రాములు నాయక్, నర్సారెడ్డిలను కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా  అభినందించారు. డిఎస్ కూడా తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాంగ్రెసులోకి మరింత మంది వస్తారని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. కేసీఆర్ గద్దె దించేందుకు అందరూ కలిసి పనిచేస్తారని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

ఢిల్లీకి డీఎస్ :రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం

 కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు

కేసీఆర్‌తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

click me!