
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు ఎర్రవల్లిలో తలపెట్టిన రచ్చబండి కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లుగా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (jagga reddy)ప్రకటించారు. రేవంత్ రెడ్డి అందరినీ విభజించి కార్యక్రమాలు ప్రకటిస్తున్నారని ఫైరయ్యారు. ఈ విషయంపై తాను అధిష్టానానికి లేఖ రాస్తానని హెచ్చరించారు. పీఏసీలో చర్చించకుండానే రేవంత్ కార్యక్రమాలు ప్రకటిస్తున్నారని.. ఆ హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు జగ్గారెడ్డి.
అంతకుముందు రైతు సమస్యలపై ప్రభుత్వం వింత వైఖరి అవలంబిస్తోందన్నారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దళారులు మోసం చేయకుండా వుండటానికే ఎంఎస్‌పీ వుందని రేవంత్ చెప్పారు. వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.400 వున్న ధరను కాంగ్రెస్ వెయ్యికి పెంచిందని ఆయన గుర్తుచేశారు. మోడీ (narenedra modi) ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే నల్లచట్టాలు (farm laws) తెచ్చిందని ఆయన మండిపడ్డారు.
ALso Read:అందరికీ శతృవయ్యా, 2023 వరకు పార్టీ వ్యవహరాలపై మాట్లాడను: జగ్గారెడ్డి
రైతులను బానిసలుగా మార్చాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడ్డారని.. అందుకే మోడీ క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే చట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రి తోమర్ (narendra singh tomar) వ్యాఖ్యలు చేయడం దారుణమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని.. కనీసం రైతుల వివరాలను సేకరించలేదని ఆయన దుయ్యబట్టారు.