హైదరబాదీలకు కేటీఆర్ గుడ్ న్యూస్... వచ్చే వారమే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

Published : Aug 16, 2023, 01:45 PM IST
హైదరబాదీలకు కేటీఆర్ గుడ్ న్యూస్... వచ్చే వారమే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

సారాంశం

డబుల్ బెడ్రూం ఇళ్లకోసం ఎదురుచూస్తున్న హైదరబాదీలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే వారమే ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. 

హైదరాబాద్ : పేద, మద్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్ట్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం. గతంతో ఇచ్చిన హామీ మేరకు భారీగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిన బిఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీని కూడా ప్రారంభించింది. ఇక ప్రస్తుతం ఎన్నికల సమయం కాబట్టి భారీగా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్ల పంపిణీని మరింత వేగవంతం చేయాలని... ఆ దిశగా సత్వర చర్యలు చేపట్టాలని పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమావేశంలో  హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 70 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని అధికారులు కేటీఆర్ కు తెలిపారు. అయితే అర్హులను గుర్తించే ప్రక్రియకూడా వేగంగా కొనసాగుతోందని... ఇళ్లకోసం అందిన దరఖాస్తులను పరిశీలన దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు తెలిపారు. 

నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్దంగా వున్న ఇళ్ల పంపిణీ విడతల వారిగా చేపట్టాలని... వారం రోజుల్లో మొదటి విడత పంపిణీ ప్రారంభం కానుందని కేటీఆర్ ప్రకటించారు. మొత్తం 70 వేల ఇళ్లను ఆరు దశల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి  ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసితో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు. 

Read More  RYTHU BIMA: ఐదేండ్లు పూర్తిచేసుకున్న రైతుబీమా.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు

 ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లను అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అధికారులే క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారని... ఈ ప్రక్రియ కొనసాగుతుంటుందని అన్నారు. గూడులేని పేదవారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను అందిస్తామని... ఎవరూ ఆందోళనకు గురికావద్దని  మంత్రి కేటీఆర్ సూచించారు. 

ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని మంత్రులు కేటీఆర్ కు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు. ఇలా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని వచ్చేవారం నుండి ప్రారంభించి ఎన్నికల నాటికి పూర్తిచేయనున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!