టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్ కు హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Aug 16, 2023, 1:36 PM IST

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై  మూడు వారాల్లో నివేదికను  ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సిట్ ను ఆదేశించింది. 


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై   విచారణ నివేదికను  మూడు వారాల్లో సమర్పించాలని తెలంగాణ హైకోర్టు  సిట్ ను  ఆదేశించింది.  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ పై అడ్వకేట్ శరత్ దాఖలు  చేసిన పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు  బుధవారంనాడు విచారణ నిర్వహించింది. సిట్  విచారణ నివేదికపై  హైకోర్టు   ప్రశ్నించింది.   విచారణకు  సంబంధించిన  నివేదికను  మూడు వారాల్లో ఇవ్వాలని  హైకోర్టు  సిట్ ను ఆదేశించింది.

ఈ ఏడాది మార్చి  మాసంలో  టీఎస్‌పీఎస్‌సీ  పరీక్షలను వాయిదా వేసింది.టీఎస్‌పీఎస్‌సీ  కార్యాలయంలో కంప్యూటర్లు హ్యాక్ గురయ్యాయని రెండు పరీక్షలను  తొలుత వాయిదా వేశారు . అయితే  టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష పేపర్లు లీకైనట్టుగా  పోలీసులు  గుర్తించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును సిట్ కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. బేగంపేట పోలీస్ స్టేషన్ లో తొలుత ఈ విషయమై  కేసు నమోదైంది. బేగంపేట  పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు  ఆధారంగా  సిట్ విచారణ సాగిస్తుంది.   ఈ కేసుకు సంబంధించి అనుబంధ చార్జీషీట్ దాఖలు చేసేందుకు  సిట్ ప్రయత్నాలు  చేస్తుంది.  ఈ ఏడాది జూన్  9వ తేదీన  సిట్ అధికారులు కోర్టులో చార్జీషీట్ దాఖలు  చేశారు.  రూ. 1.63  కోట్ల లావాదేవీలు జరిగాయని  చార్జీషీట్ లో  సిట్ అధికారులు పేర్కొన్నారు. చార్జీషీట్ దాఖలు  చేసిన తర్వాత  కూడ  మరికొందరిని సిట్ అరెస్ట్  చేసింది.ఈ కేసులో  ఇప్పటికే  96 మందిని సిట్ అరెస్ట్  చేసింది.  ఇంకా కొందరిని  అరెస్ట్  చేసే అవకాశం ఉంది.

Latest Videos

also read:గ్రూప్-2 పరీక్షల వాయిదాకై టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఆందోళన: కోచింగ్ సెంటర్ల పాత్రపై అనుమానాలు

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో  రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లు కీలకంగా వ్యవహరించినట్టుగా  సిట్ గుర్తించింది.  ఒకరి ద్వారా  మరొకరికి  పేపర్లు  లీకైన విషయాన్ని  సిట్ తమ దర్యాప్తులో గుర్తించింది.  వరంగల్ కు  చెందిన  విద్యుత్ శాఖలో డీఈగా  పనిచేసిన  రమేష్  కోచింగ్ సెంటర్లలో అభ్యర్థులకు విస్తృతంగా  పేపర్లను  అందించినట్టుగా  సిట్ తమ దర్యాప్తులో తేల్చింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఫిర్యాదు మేరకు  ఈడీ అధికారులు  విచారణను ప్రారంభించారు.  ఇదిలా ఉంటే పేపర్ లీకైన పరీక్షలను  కొన్నింటిని టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసింది.  రద్దు చేసిన కొన్ని పరీక్షలను  తిరిగి నిర్వహిస్తుంది.


 

click me!