డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: ఆ ముగ్గురూ పోకీరీలే, బైక్‌పై డేంజర్ సింబల్

By narsimha lodeFirst Published Dec 1, 2019, 6:30 PM IST
Highlights

నారాయణపేట జిల్లాలోని గుడిగండ్లకు చెందిన ముగ్గురు పోకీరీలు డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యలో పాల్గొన్నారు. 


హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులు నారాయణపేట జిల్లాకు చెందినవారు. వీరిలో గుడిగండ్లకు చెందిన ముగ్గురిని గ్రామస్తులు పోకిరీలుగా పిలిచేవారు. జల్సాలు చేస్తూ గడిపేవారని స్థానికులు చెబుతున్నారు.

Also read:మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయి: ప్రియాంక ఘటనపై కేసీఆర్ స్పందన

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో  జక్లేర్ కు చెందిన మహ్మద్ ఆరిఫ్ ఏ1 నిందితుడుగా ఉన్నాడు. గుడిగండ్లకు చెందిన నవీన్, శివ, చెన్నకేశవులు కూడ ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారు. చెన్నకేశవులు ప్రేమ వివాహం చేసుకొన్నాడు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతిద.

గుడి గండ్లకు చెందిన నవీన్, శివ, చెన్నకేశవులు, జక్లేర్ కు చెందిన ఆరిఫ్‌లు ఒకే లారీపై డ్రైవర్, క్లీనర్‌గా పనిచేస్తున్నారు. నవీన్, చెన్నకేశవులు,  శివలు గ్రామంలో జులాయిగా తిరిగేవారు. ఇటీవలనే వారంతా లారీపై పనికి కుదిరారు.

Also Read:ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు: రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు

గుడిగండ్లలో నవీన్ పేరు చెబితేనే స్థానికులు భయానికి గురౌతున్నారు. నవీన్ తన బైక్‌పై హెడ్‌లైట్ తీసేసి చిన్న లైట్లు పెట్టాడు. హెడ్ లైట్ స్థానంలో  డేంజర్ అంటూ  రాసి ఉన్న సింబల్ ను పెట్టుకొన్నాడు. బైక్ వెనుకన పులి గుర్తును పెట్టాడు. ఈ పులి గుర్తు కింద  ఎన్ అనే  అక్షరం స్టిక్కర్ వేసుకొన్నాడు.

నవీన్ తన బైక్‌ సైలెన్సర్ తీసి గ్రామంలో నడిపేవాడు. దీంతో బైక్ శబ్దం చేసేది.  ఈ రకంగా బైక్ నడపకూడదని గ్రామానికి చెందిన గ్రామ పెద్ద నవీన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ గ్రామానికి చెందిన ముగ్గురు కూడ ఎప్పుడూ కూడ జల్సాలు చేసుకొనేవారు.

Also Read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

తమ జల్సాల కోసం లారీపై పనికి వెళ్లేవారు. పని నుండి వచ్చిన తర్వాత జల్సాలు చేసుకొంటూ ఉండేవారని స్థానికులు చెప్పారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య జరిగిన విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.అప్పటి నుండి నవీన్ కుటుంబసభ్యులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. 

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య విషయం తెలిసిన వెంటనే స్థానికులు  ఈ ముగ్గురి గురించే చర్చించుకొంటున్నారు. పోకీరీలుగా ముద్రపడిన ఈ ముగ్గురూ గ్రామానికి వస్తే తమను కూడ ఏం చేస్తారోననే ఆందోళన కూడ లేకపోలేదు.

 
 

click me!