కేసీఆర్ కొత్త పిట్టకథ : రామాయణం టు కలియుగం

By telugu team  |  First Published Dec 1, 2019, 6:26 PM IST

ఆర్టీసీ సంస్థ బలోపేతానికి అందరం కృషి చేయాలని చెబుతూనే, ఆర్టీసీని బ్రతికించుకుందామనే ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటారని యూనియన్ నేతలను ఉద్దేశిస్తూ అన్నాడు. వారందరు మామూలు మానుషాల్లాగానే ఉన్నప్పటికీ వారు మనుషులు కాదని ఒక పిట్టకథను చెప్పారు. 


హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో కలిసి భోజనం చేస్తానని, వారి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినట్టే, వారందరినీ పిలిచాడు కలిసి భోజనం చేసాడు. ఆర్టీసీ కార్మికుల మీద వరాల జల్లు కురిపించాడు ముఖ్యమంత్రి కేసీఆర్. 

ఇలా కేసీఆర్ మాట్లాడుతూ,ఆర్టీసీ సంస్థ బలోపేతానికి అందరం కృషి చేయాలని చెబుతూనే, ఆర్టీసీని బ్రతికించుకుందామనే ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటారని యూనియన్ నేతలను ఉద్దేశిస్తూ అన్నాడు. వారందరు మామూలు మానుషాల్లాగానే ఉన్నప్పటికీ వారు మనుషులు కాదని ఒక పిట్టకథను చెప్పారు. 

Latest Videos

undefined

ఈ సారి కేసీఆర్ పిట్టకథ రామాయణం నాటిదండోయ్. సీతమ్మవారిని ఎత్తుకెళ్లిన తరువాత రాముడు ఎట్టకేలకు తన వానర సైన్యంతో లంక చేరుకున్నాడు. అక్కడ ధర్మ యుద్ధం ప్రారంభమైంది. ఇలా కేసీఆర్ ధర్మ యుద్ధం గురించి ఓప్రస్తావిస్తూ ఆ కాలంలో ధర్మ యుద్ధాలు మాత్రమే జరిగీర్వాణి, ఇప్పటిలెక్క లంగ యుద్ధాలు ఉండేవి కావని జోకులు కూడా పేల్చారు. 

Also read: ప్రియాంక రెడ్డి ఘటన: తన తల్లికి నిందితుడు చెప్పిన కట్టు కథ తెలుసా...?

ఇక కథలోకి వస్తే యుద్ధంలో రాక్షసులు మీద పడి దాడులు చేస్తుండడంతో వానర సైన్యం విపరీతంగా నష్టపోయిందట. అప్పుడు రాత్రి రివ్యూ మీటింగ్ పెట్టారట రాముడు అండ్ వానర సైన్యం. 

ఆ రివ్యూ మీటింగ్ లో వానరులు తమకు అత్యంత నష్టం వాటిల్లుతుందని వాపోయారట. ఒక్క రాక్షసుడి దెబ్బకు పది మందిమి చనిపోతున్నామని వానరులు వాపోయారట. ఇలా రాక్షసులు ఈ విధంగా దాడులు చేస్తుంటే, గెలవలేమని వానరులు అన్నారట. 

రాముడు వెంటనే రాక్షసులందరిని సంహరించే రామబాణం తన వద్ద ఉందని, దాన్ని ప్రయోగిస్తే ఒక్కటే దెబ్బకు యుద్ధం గెలవొచ్చు అన్నాడట. కాకపోతే ఇలా రామబాణాన్ని ప్రయోగిస్తే సృష్టి విరుద్ధమవుతుందని అన్నదాత. ఎవరు ఎన్ని రోజులు బ్రతకాలో అన్ని రోజులు వారికి బ్రతికే హక్కు ఉంటుందని, ఇలా ఆయుష్షు తీరకుండా చంపడం సృష్టి విరుద్ధమవుతుందని అన్నదాత. 

దీనికి వెంటనే వానరులు స్పందించి, మనం ఈ యుద్ధం గెలిచి తీరాలి. గెలవాలి అంటే బాణం ప్రయోగించాల్సిందే అన్నారట. శ్రీ రామ చంద్రులవారు మీరు దేవుడు కదా, ఆయుష్షు తీరకుండా చనిపోయినోళ్ల సంగతి మీరు చూసుకోండి,దానికేదో పరిష్కారం తరువాత వెతకండి అన్నారట. కానీ యుద్ధం గెలవాలంటే రామబాణాన్ని ప్రయోగించాల్సిందే అని వారు డిమాండ్ చేశారట. 

వారి వాదనలకు కరిగిన రాముడు సరేనన్నాడట. తెల్లారి బాణం ప్రయోగించాడట. రాక్షసులంతా ఒక్కటే దెబ్బకు స్మాష్ అయ్యారట. వానరులంతా ఆనందోత్సాహాలు జరుపుకొని, రాముడు సీతమ్మను తీసుకొని వెనక్కి మళ్లాడట. ఇక్కడే కథలోని అసలు ట్విస్ట్... 

Also read: ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

రాముడు వెనక్కి తిరగగానే ఆయుష్షు తీరకుండా చనిపోయిన వారంతా రాముడికి అడ్డుతగిలారట. వారు రాముడ్ని తమ ఆయుష్షు తీరకుండా తమను ఎందుకు చంపావని ప్రశ్నిస్తూ, న్యాయం కావాలని డిమాండ్ చేశారట. రాముడు వారికి హామీ ఇస్తూ, మిగిలిన కాలమంతా కలియుగంలో పుట్టి జీవించండి అని అన్నారట. 

ఇలా కేసీఆర్ యూనియన్ నాయకులను రాక్షసులతో పోల్చాడు. ఈ పిట్టకథ చెబుతున్నప్పుడు అక్కడ నవ్వులు పూశాయి. 

click me!