మేడారం వెళ్తున్నారా ? తొలి మొక్కు ఎక్కడ చెల్లించాలో తెలుసా ? (ఫొటోలు)

By Sairam Indur  |  First Published Feb 3, 2024, 9:55 AM IST

మేడారం (medaram) వెళ్లే భక్తులు తప్పన సరిగా గుట్టమ్మ తల్లి (guttamma thalli)ని దర్శించుకుంటారు. ముందుగా ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తరువాతే సమ్మక్క-సారలమ్మ (sammakka-saralamma jathara)కు మొక్కులు చెల్లిస్తారు. (medram jathara) ఇది ఆనవాయితీగా వస్తోంది.


ములుగు జిల్లాలోని మేడారం సమ్మక- సారలమ్మ జాతరకు సిద్ధమవుతోంది. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా మేడారం వెళ్లే భక్తులకు ప్రభుత్వం తాజాగా పర్యావరణ ప్రభావ రుసుము నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీనికి ఆసియాలోనే జరిగే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుంది. 

Latest Videos

undefined

అయితే మేడారంకు వెళ్లే భక్తులంతా ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించే ముందు ఈ గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది కూడా ములుగు జిల్లాలోనే ఉంది. అందుకే ఈ గట్టమ్మ తల్లి దేవాలయాన్ని మేడారానికి ముఖ ద్వారం అని అంటారు. ఎక్కడిక్కెడి నుంచో వచ్చే భక్తులు, వాహనాలు ముందుగా ఆ ఆలయం దగ్గరే ఆగుతాయి. ఇక్కడ తప్పకుండా పూజలు చేసి, మొక్కులు చెల్లిస్తారు. అందుకే ఆ దేవతను మొక్కుల తల్లి అని అంటారు. 

ఎవరీ గుట్టమ్మ తల్లి.. 

చరిత్రకారుల ప్రకారం.. 12వ శతాబ్దంలో ఓరుగల్లును కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు. రాజ్య విస్తరణ చేయాలనే ఉద్దేశంతో పగిద్దరాజుపై యుద్ధం ప్రకటించాడు. అయితే ఇందులో సమ్మక్క కూడా పాల్గొంది. ఆమెకు ఈ గుట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉండేది. ఆమె కూడా ఈ యుద్ధంలో పాల్గొని, వీరోచితంగా పోరాడింది. 

ఈ యుద్ధంలో గుట్టమ్మ తల్లి వీర మరణం పొందింది. ఆమెతో పాటు చాలా మంది ఈ యుద్ధంలో మరణించినప్పటికీ.. సమ్మక తల్లిని కాపాడుతూ పోరాడటం వల్ల గుట్టమ్మ తల్లికి గొప్ప పేరు వచ్చింది. అందుకే సామక్క-సారలమ్మ తల్లిని దర్శించుకునే ముందు గుట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

click me!