దిశ రేప్, హత్య ఎఫెక్ట్: రింగ్ రోడ్డు అండర్ పాస్ లకు వెలుగులు

By telugu teamFirst Published Mar 2, 2020, 1:18 PM IST
Highlights

విద్యుద్దీపాలు ఉండి ఉంటే దిశ రేప్, హత్య సంఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై విద్యుద్దీపాలు అమరుస్తున్నారు.

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ రేప్, హత్య విషయంలో పెద్ద యెత్తున్న విమర్శలు రావడంతో హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఎ) మేల్కొంది. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు తొండుపల్లి టోల్ గేట్ ప్లాజా వద్ద  సర్వీస్ రోడ్డు వద్ద దిశపై నవంబర్ 27వ తేదీన అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని చటాన్ పల్లి అండర్ పాస్ నిందితులు కాల్చివేశారు. విద్యుత్ దీపాలు ఉండి ఉంటే దిశ ఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. దీంతో హెచ్ఎండిఎ ఓఆర్ఆర్ విభాగం అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు 

హెచ్ఎండిఎ అనుబంధ విభాగమైన గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్ జీసిఎల్) ఓఆర్ఆర్ విభాగానికి చెందిన అధికారులు విద్యుత్తు దీపాలను అమర్చే పని పెట్టుకున్నారు.

హెచ్ జీసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హరిచందన దాసరి ఆదేశాలతో డిసెంబర్ లో ఓఆర్ఆర్ అండర్ పాస్ ల్లో ఎల్ఈడీ, సోలార్ లైట్లు అమర్చడానికి టెండర్లు ఆహ్వానించారు. 158 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ కు 165 అండర్ పాస్ మార్గాల్లో రూ.1.90 కోట్ల వ్యయంతో విద్యుదీకరణ పనులు చేపట్టారు బుధవారం నుంచి ఈ లైట్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. 

click me!