దిశ రేప్ నిందితుల ఎన్‌కౌంటర్‌: నాడు సజ్జనార్‌, నేడు పోలీసులను ఎత్తుకొని డ్యాన్స్

By narsimha lode  |  First Published Dec 6, 2019, 1:01 PM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులను తమ భుజాలపై ఎత్తుకొని నృత్యం చేశారు. 



హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన స్వప్నిక, ప్రణీతపై జరిగిన యాసిడ్ దాడి తర్వాత ఆనాడు వరంగల్ ఎస్పీ సజ్జనార్‌‌ను ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు తమ భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేశారు. చటాన్‌పల్లి వద్ద ‌ఎన్‌కౌంటర్‌ తర్వాత  పోలీసులను కూడ ప్రజలు పోలీసులను తమ భుజాలపై ఎక్కించుకొని నృత్యాలు చేశారు.

Also read:నన్ను కాల్చి చంపండి: దిశ రేప్ నిందితుడు చెన్నకేశవులు భార్య

Latest Videos

undefined

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో 2008 డిసెంబర్ 10వ తేదీన కిట్స్ కాలేజీ విద్యార్ధినులు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్‌ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. యాసిడ్ దాడిలో స్వప్నిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.ప్రణీత ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకొంది.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

ఈ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత  ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లిన సజ్జనార్‌ను విద్యార్థులు తమ భుజాలపై ఎత్తుకొని నృత్యం చేశారు. కేరింతలు కొట్టారు.సజ్జనార్‌‌ను భుజాలపై ఎత్తుకొన్నారు. 

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్ : వారం రోజుల క్రితం రాళ్లు, నేడు పోలీసులపై పూల వర్షం

ఇవాళ కూడ ఇదే తరహా ఘటన చోటు చేసుకొంది. దిశ రేప్ నిందితులను చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేశారు.ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మృతి చెందారు. 

Also read:మా కూతురు ఆత్మకు శాంతి కలిగింది: నిందితుల ఎన్‌కౌంటర్ పై దిశ ఫ్యామిలీ

ఈ ఘటన తర్వాత పోలీసులపై ప్రశంసలు కురిపించారు. పోలీసులపై పూలు చల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.‌ఎన్‌కౌంటర్ ఘటన ప్రాంతాంలో పోలీసులను ప్రజలు తమ భుజాలపై ఎత్తుకొని డ్యాన్స్ చేశారు. 


 

click me!