అప్పుడు వైఎస్ఆర్...ఇప్పుడు కేసీఆర్.. ఇద్దరు చేసిందీ ఒకటే..

By telugu team  |  First Published Dec 6, 2019, 12:20 PM IST

ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆడపిల్లకు రక్షణే లేదా అంటూ అందరూ గళం వినిపించారు. నడిరోడ్డుపై ఆడపిల్లల ప్రాణాలు తీస్తుంటే... ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. వాటికి అప్పుడు వైఎస్ఆర్,  ఇప్పుడు కేసీఆర్.. సరైన సమాధానం చెప్పారు.


దిశ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసింది.. ఆమెను హత్య చేసిన తీరు విన్న ప్రతి ఒక్కరూ నిందితులను కఠినంగా శిక్షించాలనే కోరుకున్నారు. బహిరంగా ఉరిశిక్ష వేయాలని కోరుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. కాగా.. ప్రజల మన్నలను ప్రభుత్వం ఆలకించింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసేసింది. 

సరిగ్గా 11 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. యాసిడ్ బాధితురాలికి న్యాయం చేశారు. యువతిపై యాసిడ్ దాడి చేసిన ముగ్గురు నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేశారు. అప్పుడు.. వైఎస్ హయాంలో ఆ యువతి కుటుంబీకులకు న్యాయం జరిగితే.. నేడు కేసీఆర్ హయాంలో.. మళ్లీ న్యాయం జరిగింది.

Latest Videos

undefined

ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆడపిల్లకు రక్షణే లేదా అంటూ అందరూ గళం వినిపించారు. నడిరోడ్డుపై ఆడపిల్లల ప్రాణాలు తీస్తుంటే... ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. వాటికి అప్పుడు వైఎస్ఆర్,  ఇప్పుడు కేసీఆర్.. సరైన సమాధానం చెప్పారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే... అప్పుడు...  స్వప్నిక అనే యువతి ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. అందుకు ఆమె అంగీకరించలేదని.. స్కూటీపై వెళ్తుండగా.. యాసిడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో స్వప్నిక ప్రాణాలు కోల్పోగా... ఆమె స్నేహితురాలు ప్రణిత తీవ్రగాయాలపాలైంది.
ఈ ఘటన అప్పుడు సంచలనం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేశారు.

వారి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు.. యువతిపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ అతనికి సహకరించిన బజ్జూరి సంజయ్, పోతురాజు హరికృష్ణలను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

ఇప్పుడు.. దిశ అనే యువతి ట్రీట్మెంట్ కోసం సాయంత్రం ఆరు గంటల సమయంలో టోల్ ప్లాజా వద్ద స్కూటీ పార్క్ చేసి.. క్యాబ్ లో ఆస్పటల్ కి వెళ్లింది. ఆమెపై అప్పుడే కన్నేసిన నలుగురు కామాంధులు ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ లు... ఆమె స్కూటీని పంక్చర్ చేశారు. ఆమె తిరిగి వచ్చే సరికి చీకటి కావడంతో.. స్కూటీ బాగు చేయిస్తామని నమ్మబలికారు. తర్వాత ఎత్తుకెళ్లి.. అరవకుండా నోట్లో మద్యం పోసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను పెట్రోల్ పోసి తగలపెట్టారు.

ఈ కేసులో నిందితులను పోలీసులు కేవలం 48గంటల్లో పట్టుకోగలిగారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ హయాంలో.. పోలీసులు దిశకు న్యాయం చేశారు. దిశ నిందితులను ఈ రోజు ఉదయం ఎన్ కౌంటర్ చేశారు.

ఈ ఇద్దరు సీఎంలు తీసుకున్న నిర్ణయంపట్ల ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. నేటి ఘటనతో ... అప్పటి సీఎం వైఎస్ఆర్ ని కూడా ప్రజలు గుర్తుతెచ్చుకుంటున్నారు. కేవలం బులెట్లతో.. న్యాయం చేయడంతోపాటు.. తప్పుచేయాలనే మరికొందరి ఆలోచనలకు అడ్డుకట్ట వేశారు. వీరి ఘటనతో.. కొందరిలోనైనా మార్పు వస్తుందని ఆశిద్దాం.

click me!