దిశ హత్య కేసులో మానవ మృగాలకు తగిన గుణపాఠం ఇచ్చారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు హాట్సాఫ్ అంటున్న నెటిజన్లు తెలంగాణలో సరైనోడు అంటే మీరే సార్ అంటూ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిశ కుటుంబం కన్నీళ్లను తుడవడమే కాకుండా తెలంగాణ సమాజానికి, ఆడపిల్లల భవిష్యత్ కు భరోసా ఇచ్చేలా తీర్పునిచ్చారంటూ ప్రశంసిస్తున్నారు.
దిశ హత్య కేసులో మానవ మృగాలకు తగిన గుణపాఠం ఇచ్చారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు హాట్సాఫ్ అంటున్న నెటిజన్లు తెలంగాణలో సరైనోడు అంటే మీరే సార్ అంటూ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
undefined
ఇకపోతే దిశపై రేప్, హత్య ఘటనపై స్పందించిన కేటీఆర్ ఇకపై ఈ కేసును తాను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇదే ఘటనపై ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్ సైతం చేశారు.
ప్రియాంకరెడ్డి హత్య కేసు: రంగంలోకి కేటీఆర్, తానే పర్యవేక్షిస్తానంటూ ట్వీట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ, నిర్భయపై దారుణమైన అత్యాచారం, హత్య జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా నిందితులను ఉరి తీయలేదు! తొమ్మిదేళ్ల పసిపాప ఈ మధ్యనే అత్యాచారానికి గురైంది. కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తే హైకోర్టు ఆ తీర్పును సవరించి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది!
హైదరాబాద్‌లో ఒక యువ పశువైద్యురాలిని పాశవికంగా హత్య చేశారు. వారిని పట్టుకున్నాం. అయితే, ఆ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతున్న బాధిత కుటుంబాన్ని మనం ఎలా ఓదార్చగలమనే నేను ఆలోచిస్తున్నా’’ అని ఈ ట్వీట్లలో కేటీఆర్ పేర్కొన్నారు.
‘‘న్యాయం చేయడం ఆలస్యమైతే, న్యాయం చేయడానికి నిరాకరించినట్లే లెక్క సర్. ఎలాగూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక రోజు మొత్తం దీనిపై చర్చ జరపాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లను సవరించండి. మన మహిళలు, పిల్లలపై ఇలాంటి క్రూరమైన హింసకు పాల్పడే వారికి తక్షణం ఉరిశిక్ష విధించేలా, ఈ తీర్పుపై ఎలాంటి సమీక్ష లేకుండా చట్టాలను సవరించాలి అంటూ ప్రధాని మోదీకి సూచించారు.
నో అప్పీల్స్.. ఓన్లీ హ్యాంగింగ్: చట్టాలను మార్చండి, ప్రధాని మోడీకి కేటీఆర్ ట్వీట్
‘‘మన చట్టం, న్యాయంలో ఉన్న పురాతన భాగాలను సవరించాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశంలోని చట్టం అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్న ఈ జంతువుల నుంచి మన జాతిని రక్షించుకునేందుకు మనం వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.
నరేంద్ర మోదీ జీ, దుఃఖంతో ఉన్న, ఏమీ చేయలేకున్న, మనలాంటి చట్టసభ్యులు సమయానికి అనుగుణంగా స్పందించి వేగంగా న్యాయం చేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది ప్రజల తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
దిశ కేసులో నిందితులను వెంటనే చంపేయా లని, ఉరిశిక్ష విధించాలని దేశ మంతా కోరుతోంది. సమస్య ఏదైనా ప్రజలు తక్షణ పరిష్కారం కోరుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా లేదు. నిర్భయ నిందితులకు ఇంతవరకు శిక్ష పడలేదు అంటూ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
మంబై దాడుల ఉగ్రవాది కసబ్‌కు ఉరి శిక్ష ఎంత జాప్యమైందో తెలిసిందేనని చెప్పుకొచ్చారు కేటీఆర్. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో 140 మంది సివిల్ సర్వెంట్ల శిక్షణ ముగింపు సమావేశానికి గురువారం ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ సమస్యలను ఓపిగ్గా వినే లక్షణం ప్రతి సివిల్ సర్వెంట్‌కు ఉండాలన్నారు. వ్యవస్థలో మార్పుకు కృషి చేయాలని సూచించారు.
ప్రియాంక హత్య: మీరు ఆ పని చేయాల్సిందే.. మోడీ, కేటీఆర్ కు మహేష్ బాబు రిక్వస్ట్!
వైన్ షాపుల పరిసర ప్రాంతాల్లో, రోడ్లపై, ఖాళీ స్థలాల్లో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కేటీఆర్ ఆదేశించారు. దిశ నిందితులు మద్యం తాగినట్లు ప్రస్తావనకు రావడంతో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మే, ఆరు బయట తాగడాన్ని ప్రోత్సహించే దుకాణాలను మూసివేయాలని కేటీఆర్ సూచించారు.
అలాగే డయల్ 100పై ప్రచారం పెంచాలని, రహదారులపై కాంతిని పెంచేలా అదనపు దీపాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సమావేశంలో అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే.