Disha Case Accused Encounter: సీపీ సజ్జనార్ పై అయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Dec 6, 2019, 11:01 AM IST
Highlights


రాజకీయ జోక్యంతోనే తన బిడ్డ అయేషా మీరాకు న్యాయం జరగడం లేదని వాపోయారు తల్లి షంషాద్ బేగం. సజ్జనార్‌ లాంటి అధికారి ఆయేషామీరా కేసును దర్యాప్తు చేసుంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. 
 

గుంటూరు: దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై అయేషా మీరా తల్లి షంషాద్ బేగం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ హత్య కేసులో నిందితులు సామాన్యులు కాబట్టే ఎన్ కౌంటర్ చేశారంటూ ఆమె ఆరోపించారు. 

నిందితులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఎన్ కౌంటర్ వల్ల దిశకు కొంత న్యాయం జరిగినట్లేనని స్పష్టం చేశారు. ఇకపోతే తన కుమార్తె అయేషా మీరా హత్య కేసులో తనకు న్యాయం జరగలేదని వాపోయారు.  

రాజకీయ జోక్యంతోనే తన బిడ్డ అయేషా మీరాకు న్యాయం జరగడం లేదన్నారు. అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఆయేషా తల్లి అన్నారు. సజ్జనార్‌ లాంటి అధికారి ఆయేషామీరా కేసును దర్యాప్తు చేసుంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. 

27 డిసెంబరు 2007 న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఓ లేడీస్ హాస్టల్ లో ఉంటున్న అయేషా మీరాను అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తున్న 19 ఏళ్ళ ఆయేషాపై అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. 

అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులు ఎవరు అనేది ఇంకా తెలియని పరిస్థితి. అయితే ఈకేసును ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

జస్టిస్ ఫర్ దిశ: జయహో తెలంగాణ పోలీస్

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 


దిశ హత్య కేసు... ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి సీపీ సజ్జనార్

click me!