కేసీఆర్ రాజనీతి అదే: సినీనిర్మాత కేతిరెడ్డి ప్రశంసలు

By Nagaraju penumalaFirst Published Dec 7, 2019, 10:08 PM IST
Highlights


దిశపై రేప్, అత్యాచారం ఘటన జరిగినరోజు పలు పార్టీల నేతలు, మీడియా కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారని గుర్తు చేశారు. అయితే విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకునేలా కేసీఆర్ చక్కటి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు. 
 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు సినీ నిర్మాత, దర్శకుడు, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. దిశ ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ తన రాజనీతిని ప్రదర్శించారని కొనియాడారు. 

దిశపై రేప్, అత్యాచారం ఘటన జరిగినరోజు పలు పార్టీల నేతలు, మీడియా కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారని గుర్తు చేశారు. అయితే విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకునేలా కేసీఆర్ చక్కటి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు. 

దిశ ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయని ప్రతీ ఒక్కరూ నలుగురు మానవ మృగాలను ఎన్ కౌంటర్ చేయాలని నినదించారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పలువురు కేసీఆర్ ను వ్యక్తిగతంగా కూడా విమర్శించారంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు.  

నిందలు పడ్డా కేసీఆర్ కృంగి పోలేదని తన రాజనీతిని చూపించారని పొగడ్తలతో ముంచెత్తారు. వ్యవస్థ లో ఉన్న లోపాలే ఈ హత్యాచారాలకు కారణం అని రాజకీయ పార్టీలు తెలుసుకొని ముక్తకంఠంతో ఘటనలను ఖండించాలే గానీ ఇలాంటి సందర్భాలను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం దురదృష్టకరమన్నారు.  

దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ రాష్ట్రాల ప్రజలు, మహిళలతో కలిసి ఒక చర్చావేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆచర్చల్లో లేవనెత్తిన అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఒక నివేదికలా ఇవ్వనున్నట్లు తెలిపారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్: సరైనోడు మీరే సర్! కేటీఆర్ పై నెటిజన్ల ప్రశంసలు

నిర్భయ చట్టం తీసుకొచ్చినప్పటికి దానిని ప్రజల్లోకి తీసుకుపోలేక పోవడంతో అది అనుకున్న ఫలితాలను సాధించలేకపోయిందని అన్నారు. నిర్భయ చట్టంపై అవగాహన సదస్సులు పెట్టాలని సూచించారు. 

ప్రస్తుత తరుణంలో మహిళల చట్టాలు పెట్టాలంటే ప్రభుత్వాలు సైతం భయపడే పరిస్థితి గతంలో ఉండేదని నేడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. గతంలో తీసుకొచ్చిన 498aతోపాటు ఇతర చట్టాలను కొంతమంది మహిళలు మగవాళ్లను బెదరించేందుకు ఉపయోగించడం జరుగుతుందని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు వ్యాఖ్యానించడం జరిగిందని గుర్తు చేశారు.  

చట్టాలు చేసే ముందు ప్రభుత్వాలు అందులో ఉన్న సాధకబాధకాల గురించి కూడా చర్చించాలని సూచించారు. అలాగే మహిళలపై హత్యాచారాలు రోజురోజుకు పెరుగుతుపోతున్నాయన్నారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ దారుణాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు.  

ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు డ్రెస్ కోడ్ కూడా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందన్నారు. పోర్న్ వీడియోలు చూసి నవశక్తులేని యువకులు నిర్వీర్యం అవుతున్నారని అరచేతిలో సెల్ ఫోన్ వైకుంఠం ద్వారా వారు మానవ ధర్మాన్ని మరచి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పలు దేశాల్లో పోర్న్ సైట్స్ ను నిషేధించారని కానీ భారతదేశంలో ఇంకా పోర్న్ సైట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ వారిలోని మార్పులను సరి చేయాలని సూచించారు. 
 

తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: హీరో సజ్జనార్.

ప్రస్తుత కాలంలో యువత చెడదారి పట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని వారు ఆదిశగా అడుగులు వేయకుండా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అంతేకాకుండా నేడు వస్తున్న సినిమాల ప్రభావం కూడా యువతపై ఉందని చెప్పుకొచ్చారు. 

ఒక సినిమాలో ఒక చేడు సంఘటనతో పాటు సినిమా చివర్లో ఒక మంచి సందేశం ఇచ్చి నప్పుటికీ యువత మాత్రం చెడుకే ఎక్కువ ప్రభావితం అవుతున్నారని ఆరోపించారు. ఫిల్మ్ సెన్సారింగ్ విధానంలో కూడా కేంద్రం మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రతీ సినిమా ఖచ్చితంగా ఒక పోలీసు అధికారి, ఒక మానసిక నిపుణుల పర్యవేక్షణలో సెన్సార్ చేయాలని సూచించారు. ,సమాజంపై, పిల్లలపై ఆ చిత్రం ఎంత వరకు ప్రభావితం చూపుతుందోనని బేరీజు వేసుకుని సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదిశగా అడుగులు వేయాలని సూచించారు. 

సమస్య జరిగినప్పుడే  సమస్య గురించి కొన్ని రోజులు చర్చించటం కాకుండా సత్వరమే చర్యలు తీసుకోని ఒక కఠిన చట్టంతో పాటు దాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి మగవాళ్ళకు భయం, ఆడవాళ్లు కు భరోసా కల్పించాలనిని సూచించారు. చట్టాలు చేసినంత మాత్రాన ప్రయోజనాలు ఉండవని కఠినమైన ఆచరణ చాలా ముఖ్యమని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

మధ్యలో పోలిసులే బలిపశువులు... ఎన్కౌంటర్ తర్వాత పోలీసుల పరిస్థితి ఘోరం!!

click me!