కేసీఆర్ టెన్షన్: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖ, త్వరలో మోదీతో భేటీ

By Nagaraju penumalaFirst Published Dec 7, 2019, 8:03 PM IST
Highlights

2019-20కి కేంద్రం వాటా రూ.19,719 కోట్లు రావాల్సి ఉందన్నారు. గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందింది రూ.10,558 కోట్లేనని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: కేంద్రంప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రుల మాటలకు, వాస్తవాలకు అస్సలు పొంతన లేదని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. 

రెవెన్యూ, ఆర్థిక అంశాలపై సీఎం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం ప్రస్తావించారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర పన్నుల వాటా తక్కువగా ఉందన్నారు. 

రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటారూ.924 కోట్లు తగ్గిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్థిక పరిస్థితి  ఆందోళన కరంగా మారుతుందని కేసీఆర్ తెలిపారు. పన్నుల వాటా గణనీయంగా తగ్గినందున అన్ని శాకలకు నిధులు తగ్గించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఖర్చులపై స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులను ఆదేశించారు.  

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.224 కోట్లు తక్కువగా వచ్చాయన్నారు. పార్లమెంట్ లో మంత్రులు చెప్తున్న మాటలకు వాస్తవానికి పొంతనలేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరింత ఆందోళనకరంగా మారుతుందని తెలిపారు. 

కేంద్రం వాటా తగ్గింది, అన్ని శాఖలకు నిధులు తగ్గించాలని కేసీఆర్ కోరారు. కేంద్రప్రభుత్వం లోపభూయిష్ట విధానాలే ఇందుకు కారణమని కేసీఆర్ ఆరోపించారు. అన్ని శాఖల ఖర్చుల్లో కోతలు పెట్టాలి, నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.    

 రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర వివరాలతో నివేదికను ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో ఇవ్వాలని సూచించారు. 

పన్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేసీఆర్. 

తెలంగాణకు పన్నుల వాటా విడుదల చేయాలని లేకపోతే వాస్తవాలను వెల్లడించాలని లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం లేదని కేంద్రం చెప్తున్న వాదనలో నిజం లేదని ఆరోపించారు కేసీఆర్. 

2019-20కి కేంద్రం వాటా రూ.19,719 కోట్లు రావాల్సి ఉందన్నారు. గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందింది రూ.10,558 కోట్లేనని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. 

click me!