కేటిఆర్ కు డిప్యూటీ సిఎం ఊహించని షాక్

First Published Nov 6, 2017, 6:58 PM IST
Highlights
  • కేటిఆర్ ఆదేశాలు బేఖాతర్ చేసిన డిప్యూటీ సిఎం ఫ్యామిలీ
  • సరిగ్గా ఏడాది క్రితమే ఆర్డర్ ఇచ్చిన కేటిఆర్
  • జిల్లాల్లో స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు
  • హైదరాబాద్ లో లైట్ తీసుకున్న డిప్యూటీ సిఎం ఫ్యామిలీ

తెలంగాణ రాజకీయాల్లో ఇది ఊహించని పెద్ద సంఘటన. సిఎం తనయుడు, తెలంగాణ పురపాలక, ఐటి శాఖ మంత్రి అయిన కేటిఆర్ కు ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మహమూద్ అలీ కుటుంబం షాక్ ఇచ్చింది. ఇదేంటి సొంత పార్టీలోని వారు కేబినెట్ మంత్రికే సహచర కేబినెట్ మంత్రి షాక్ ఇవ్వడమేమిటి అనుకుంటున్నారా? అవును నిజమే. కేటిఆర్ మాటను ఆ డిప్యూటీ సిఎం కుటుంబం జవదాటింది. కేటిఆర్ ఆదేశాలను రాష్ట్రమంతా పాటిస్తున్నా ఆ ఫ్యామిలీ పాటించలేదు. మరిన్ని వివరాల కోసం ఈ వార్త చదవండి.

అది నవంబరు నెల... 6వ తేదీ... సంవత్సరం 2016. ఆ తేదీకి తెలంగాణ ప్రభుత్వంలో ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వంలో అనేకంటే పురపాలక శాఖలో ఒక ప్రాముఖ్యత ఉంది. ఆరోజున సంబంధిత శాఖ మంత్రి కేటిఆర్ రాష్ట్ర ప్రజానీకానికి ఒక సందేశం ఇచ్చారు. ప్రజానీకానికి అంటే తన శాఖలోని మున్సిపల్ అధికారులందరికీ స్ట్రిక్ట్ ఆర్డర్ వేశారు. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో అయినా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు కనబడరాదు అని మంత్రి కేటఆర్ ఆదేశం. అంతేకాదు.. తుదకు తన బొమ్మతో ఫ్లెక్సీ వేసినా చింపి పడేయాలని హుకూం జారీ చేశారు. కానీ.. వాటిని స్వయంగా ఉపముఖ్యమంత్రి ఇగ్నోర్ చేశారు.

 

. Sir, Pl teach some morals to your Dy CM first. at Azampura. pic.twitter.com/6moVgMC5Q7

— Amjed Ullah Khan MBT (@amjedmbt)

సీన్ కట్ చేస్తే... మంత్రి కేటిఆర్ ఆ ఆదేశం ఇచ్చి ఇయ్యాలకు సరిగ్గా ఏడాది అయింది. అయితే ఆ ఆదేశాలను అక్కడో ఇక్కడో కొద్ది మంది మాత్రం ఉల్లంఘించిన దాఖలాలున్నాయి. జనాలు బాగానే ఫాలో అయినట్లు కనబడింది. కానీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కుటుంబమే స్వయంగా కేటిఆర్ ఆదేశాలను బేఖాతర్ చేసింది. రెండు రోజుల క్రితం మహమూద్ అలీ కుమారుడు ఆజం అలీ జన్మదినోత్సవం జరిగింది ఆ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ సమయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. సిఎం కేసిఆర్, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ ఫొటోలతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. మరి కేటిఆర్ ఆదేశాలను వారు పట్టించుకోలేదా? వారికి తెలియక ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా? లేకపోతే మంత్రి కేటిఆర్ ఆదేశాలు తమకు చెల్లవనుకున్నారా? లేక ఆ ఆదేశాలు మతికి లేవా? ఈ ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉంది.

ఇంకోవైపు గతంలో వరంగల్ పట్టణంలో మంత్రి కేటిఆర్ పర్యటన సందర్భంగా భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయం ట్విట్టర్ ద్వారా మంత్రి కేటిఆర్ కు సమాచారం అందింది. ఆ సమయంలో కేటిఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. అంతేకాదు వాటిని ఏర్పాటు చేసిన నాయకులకు జరిమానా విధించాలని కూడా గట్టి ఆదేశాలిచ్చారు. ఇలాంటి సంఘటన గతంలో కరీంనగర్ లో కూడా జరిగింది. ఆ సమయంలో కూడా కేటిఆర్ ఈ విధంగానే రియాక్ట్ అయ్యారు.

మరి తాజాగా హైదరాబాద్ లో మంత్రి కేటిఆర్ ఆర్డర్ ను డిప్యూటీ సిఎం ఫ్యామిలీ ధిక్కరించడం పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని ఎంబిటి నేత అమ్జద్ ఉల్లాఖాన్ ట్విట్టర్ లో ప్రభుత్వాన్ని ప్నశ్నించారు. మంత్రి కేటిఆర్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

click me!