మోదీ నోట్ల దెబ్బ తగిలిందా

First Published Nov 24, 2016, 4:32 AM IST
Highlights

తెలంగాణా కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి మోదీ దెబ్బ తగిలిందని చెబుతున్నారు

ప్రధాని మోదీ నోట్ల రద్దు దెబ్బ తెలంగాణ  కొత్త సచివాలయం నిర్మాణానికి కూడా తగిలిందని చెబుతున్నారు. పాత పెద్ద నోట్లు రద్దు కావడం, కొత్త నోట్లు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో వచ్చిన నిధుల కొరత వల్ల  కొత్త భవనాల ప్రతిపాదనలను కొద్ది రోజులు వాయిదావేసినట్లు అధికారులు చెబుతున్నారు.

 

నిజానికి, కొత్త భవనాల అవపరమేమిటని ప్ర శ్నిస్తూ కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డిలో  హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణ లో ఉంది.  

 

సచివాలయంలోని వివిధ శాఖల విభాగాలను వేరే చోటకు తరలించేందుకు అభ్యంతరం లేదని చెబుతూనే ప్రస్తుత భవనాలను కూల్చవద్దని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడే భవనాలను కూల్చబోమని కోర్టుకు హామీ ఇచ్చింది. ఇపుడు తాజాగా మరొక దెబ్బ తగలడంతో  ఇదొక అపశకునంగా భావిస్తున్నట్లుంది.

 

 ఫలితంగా సచివాలయంలోని అన్ని శాఖలను హైదరాబాద్‌లోని వివిధ భవనాల్లోకి  నవంబర్ రెండో వారం నాటిటకే మర్చా ప్రక్రియను ఆపినట్లు తెలిసింది. బూర్గుల రామకృష్ణారావు భవనం, అరణ్యభవన్, వ్యవసాయ భవన్, మైత్రీవనం , ఎర్రమంజిల్ తదితర భవనాల్లోకి సచివాలయంలోని  శాఖలను మార్చాలని అక్టోబర్‌లో నే  నిర్ణయించారు. ఇందుకోసం ఐఎఎస్ అధికారులతో ఒక కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.  ఇపుడు ఈ బదిలీ ప్రక్రియ ఆపేశారు. దీనికంత తొందరలేదని అధికారులు అంటున్నట్లు తెలిసింది.

 

కోర్టు కేసు కారణంగా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం ఇబ్బంది కరంగా ఉంటుందని కాబట్టి,  నోట్ల సమస్య చూపి సెక్రటేరియట్ నిర్మాణాన్ని సమస్య పరిష్కారమయ్యే వరకు అపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

 

అయిదొందల వేయి నోట్ల రద్దుతో  రాష్ట్ర ఆదాయం తగ్గిందని, కొత్త భవనాల నిర్మాణం చేపడితే  నిధుల కొరత వస్తుందేమో నని  ప్రభత్వం భావిస్తూ ఉందని ప్రచారం అవుతూ ఉంది. ఆంధ్ర పాలకుల హయాంలో నిర్మంచిన పాత సచివాలయ భవనాలు వాస్తుప్రకారం లేకపోవడం వల్ల , వాటిని కూల్చేసి, భారీగా పది అంతస్తులతో కొత్త భవనాలను, ఐదు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.  ప్రముఖ డిజైనర్ హఫీజ్ కాంట్రాక్టర్ ఒక ప్లాన్ ను కూడా ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం 350 కోట్ల రూపాయలను కేటాయించేందుకు సిద్దమయింది.
 

click me!