పెళ్లి సంబంధాల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: పెళ్లి సంబంధాల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న విషయమై హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని వెబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకున్న శ్రీమంతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
మ్యాట్రిమోని సైట్లలో అందమైన ఫోటోలను అప్ లోడ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ విషయమై ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన నుండి నుండి రూ. 26 లక్షలను తీసుకున్నట్టుగా బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై విచారణ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహేశ్వరి, తరుణ్ లను విచారిస్తున్నారు.
undefined
గతంలో కూడ మ్యాట్రిమోని సైట్ లో నకిలీ ప్రోఫైల్ సృష్టించి మోసాలకు పాల్పడిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి. న్యూఢిల్లీలో ఈ ఘటన 2022 అక్టోబర్ 21న చోటు చేసుకుంది. బిపిన్ కుమార్ ఝా అలియాస్ ఆషు కుమార్ ఆర్మీ అధికారిగా నకిలీ ప్రొఫైల్ సృష్టించారు. పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను నమ్మించేవాడు. తనను నమ్మారని భావించిన తర్వాత తన కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉందని అమ్మాయి తరపు కుటుంబ సభ్యుల నుండి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ విషయమై ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది జూలై 8న బెంగుళూరు పోలీసులు పెళ్లి చేసుకొంటానని మోసం చేస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఏపీలోని మదనపల్లికి చెందిన మహిళ వివాహం చేసుకుంటానని మోసం చేసిందని అందిన ఫిర్యాదు మేరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు