హైదరాబాద్ లో శివారులో భారీ అగ్నిప్రమాదం... కాలిబూడిదైన పరుపుల కర్మాగారం

By Arun Kumar P  |  First Published Aug 20, 2023, 10:52 AM IST

హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైలార్ దేవ్ పల్లిలోని ఓ పరుపుల కర్మాగారంలో మంటలు చెలరేగి ఆస్తినష్టం సంభవించింది. 


హైదరాబాద్ : రాజధాని నగరం హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో ఓ పరుపుల తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

హైదరాబాద్ శివారులోని మైలార్‌ దేవ్‌పల్లి టాటా నగర్ లో పరుపుల తయారీ పరిశ్రమ వుంది. శనివారం పనులు ముగించుకుని పరిశ్రమకు తాళం వేసి వెళ్లిపోయాడు యజమాని. ఈ క్రమంలో రాత్రి ఎలా అగ్గి రాజుకుందో తెలీదుగానీ ఆదివారం తెల్లవారుజాముకు కంపనీ మొత్తం మంటలు వ్యాపించాయి. కంపనీలో మంటలు ఎగసిపడటం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 

Latest Videos

Read More  హైద్రాబాద్ బహదూర్‌పురాలో ఒరిగిన నాలుగంతస్తుల భవనం: భయాందోళనల్లో స్థానికులు

దట్టమైన పొగలతో మంటలు అంతకంతకు పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకున్నా రూ.15లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. 
 

click me!