TS Inter Exams: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే, క్రిమినల్ కేసు..!

Published : Feb 26, 2024, 02:00 AM IST
TS Inter Exams: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే, క్రిమినల్ కేసు..!

సారాంశం

ఇంటర్ పరీక్షలలో కాపీ కొడుతూ పట్టుబడితే వారిపై క్రిమినల్ కేసు నమోదు కానుంది. అంతేకాదు, అధికారులపైనా యాక్షన్ తీసుకోనున్నారు.  

Exams: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొట్టినా.. మరే విధమైన మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడినా.. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. పరీక్షల్లో తప్పుడు విధానాలకు మొత్తంగా ఫుల్ స్టాప్ పెట్టడానికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్‌మీడియెట్ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఒకరి కోసం మరొకరు వచ్చి పరీక్ష రాసినా... మరే విధమైన తప్పుడు విధానాలు అవలంభించినా.. వారిపై క్రిమినల్ కేసు నమోదు కానున్నది. అలాంటి అభ్యర్థులను పరీక్షల నుంచి డిబార్ చేయనున్నారు.

అంతేకాదు, ఆ సమయంలో బాధ్యతల్లో ఉన్న అధికారులు లేదా మేనేజ్‌మెంట్లపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు పై వార్నింగ్ వర్తించనుంది.

Also Read: RGV: మరీ ఈ స్థాయిలోనా?.. పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ అరాచకం

ఈ సారి ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. అందులో 4,78,718 మంది ఫస్ట్ ఇయర్, 5,02,260 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులుఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?