తెలంగాణలో మోడీ వేవ్ లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని, ఈ ఎన్నికల్లో కారు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లుతుందని వివరించారు.
LS Polls: తెలంగాణ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లోక్ సభ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మోడీ వేవ్ లేదని అన్నారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని నెరవేర్చని ప్రధాని మోడీ గురించి ఎందుకు ఆలోచించాలి?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన నాగర్‌కర్నూల్‌లోని అచ్చంపేటలో ఫిబ్రవరి 25వ తేదీన పార్టీ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించి వెళ్లితే.. 30 సీట్లు కూడా గెలిచేది కాదు అని స్పష్టం చేశారు. రైతు బంధు నిధులు ఇంకా విడుదల చేయలేదని ఆగ్రహించారు. కరెంట్ కోతలు, తాగు నీటి కోసం తిప్పలు మొదలయ్యాయని వివరించారు. కాంగ్రెస్ అన్న మార్పు ఇదేనా? అని నిలదీశారు.
undefined
కాంగ్రెస్, బీజేపీలను ఒక్క గాటన కడుతూ ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను నాశనం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ‘ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు, కానీ, తెలంగాణ తెచ్చినవారు ఇక్కడే ఉంటారు. బీఆర్ఎస్ గులాబీ జెండా ఇక్కడే ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం గులాబీ పార్టీ గల్లీలో, ఢిల్లీలో పోరాడుతాం’ అని వివరించారు.
Also Read : Breaking : బైజూస్ ఇన్వెస్టర్ల సంచనల నిర్ణయం.. సీఈవోను తొలగించాలని ఓటింగ్
కేఆర్ఎంబీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ విమర్శలు చేశారు. ‘ఒక్కసారి నల్లగొండలో కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఈ ప్రాజెక్టులను కేంద్రానికి హ్యాండోవర్ చేయడం లేదని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేశారు’ అని పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని, ఈ ఎన్నికల్లో కారు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లుతుంది అని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.