Hyderabad: వివాదంలో కరాచీ బేకరీ..హైదరాబాద్ లో వ్యతిరేకత

Published : May 08, 2025, 10:55 AM IST
Hyderabad: వివాదంలో కరాచీ బేకరీ..హైదరాబాద్ లో వ్యతిరేకత

సారాంశం

కరాచీ బేకరీ పేరు పై హైదరాబాద్లో వ్యతిరేకత, స్వదేశీ భావోద్వేగాలు రగిలించాయి. సంస్థ స్పందనతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఫుడ్‌ బ్రాండ్‌ కరాచీ బేకరీ ఇప్పుడు పేరుపై అభ్యంతరాలు ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం స్వదేశీ బ్రాండ్‌లకు మద్దతుగా వచ్చిన ఉద్యమం మధ్య, కరాచీ అనే పేరు పాకిస్థాన్‌తో సంబంధం ఉన్నదన్న భావన కొంతమందిలో వ్యతిరేకతకు దారితీసింది.

ఎలాంటి సంబంధం లేదు

ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ బేకరీపై నిరసనలు కూడా నమోదయ్యాయి. "కరాచీ" అనే పదం దేశవిభజన, విపరీతమైన రాజకీయ జ్ఞాపకాలను గుర్తుచేస్తుందన్న వాదనతో కొందరు ఈ పేరు మార్పు చేయాలన్న డిమాండ్‌ను వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం నేపథ్యంలో కరాచీ బేకరీ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. సంస్థ ప్రతినిధులు తెలిపిన ప్రకారం, ఇది పూర్తిగా భారతీయ బ్రాండ్‌గానే స్థాపించడం జరిగింది. పేరు మాత్రమే "కరాచీ" అయినా, సంస్థకు పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. సంస్థ స్థాపకులు విభజన ముందు కరాచీ నగరంలో ఉండేవారు, వారే భారతదేశానికి వచ్చి 1953లో హైదరాబాద్‌లో ఈ బేకరీని ప్రారంభించినట్టు వివరించారు.

పరిస్థితిని ప్రశాంతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో, సంస్థ తన బ్రాంచ్‌ల వద్ద పోలీస్ భద్రతను కోరినట్టు సమాచారం. ప్రస్తుతం బేకరీ అన్ని చోట్ల సాధారణంగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది.ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కొంతమంది పేరులో మార్పు అవసరం ఉందని భావిస్తుండగా, మరికొంతమంది ఇది స్వేచ్ఛా భావనపై దాడిగా చూస్తున్నారు.ఇలాంటి సమయంలో బ్రాండ్ పేరు, వ్యాపార లక్ష్యాలు, దేశభక్తి మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్న ప్రశ్న మరోసారి ముందుకు వచ్చింది. సంస్థ స్పందన, ప్రజల అభిప్రాయాల మధ్య సమన్వయం ఎలా జరిగితే గాని ఈ వివాదానికి ముగింపు కనిపించదని అనిపిస్తోంది.

ఈ క్రమంలో అధికారవర్గాలు, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లో కరాచీ బేకరీపై కొనసాగుతున్న ఈ వివాదం ఎటువైపు మొగ్గుతుందన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుందని భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu