కేసీఆర్‌ది గ్లాస్ సర్వే...నాది గ్రాఫ్ సర్వే: టీఆర్ఎస్ గెలిస్తే చెప్పులు మోస్తా: రాములు నాయక్

By Arun Kumar P  |  First Published Oct 30, 2018, 2:53 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్‌ పార్టీకి అసమ్మతి సెగ వదలడం లేదు. ఇటీవలే ఆ పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో పాటు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో చేరినప్పటినుండి రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి అలాగే విమర్శలు చేసిన రాములు నాయక్ కేసీఆర్ సర్వేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
తాను ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సర్వేలు చేయించానని రాములు నాయర్ తెలిపారు. ఈ మూడు జిల్లాల్లోను అత్యధిక సీట్లు మహాకూటమి సాధిస్తుందని తేలిందన్నారు. అయితే తన సర్వేలు కేసీఆర్ మాదిరిగా రాత్రిపూట చేసే గ్లాస్ సర్వేలు  కావని...గ్రాఫ్ సర్వేలని అన్నారు. తాను చేపట్టిన సర్వేలు పలు ప్రామాణిక పద్దతులను అనుసరించి జరిగాయన్నారు.

Latest Videos

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కేసీఆర్, కేటీఆర్ లు అబద్దపు ప్రచారాన్ని మొదలుపెట్టారని రాములు నాయక్ మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ కారు టైర్లు పంక్చరయ్యాయని దాని స్టీరింగ్ కాంగ్రెస్ చేతికి వెళ్లిందని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 11 తర్వాత ప్రగతి భవన్ మహాకూటమి చేతుల్లోకి వెళ్లడం ఖాయమని  అన్నారు. 

కేసీఆర్ తెలంగాణలో వంద సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారన్న రాములు నాయక్ ఆయనకు ఓ సవాల్ విసిరారు. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి  నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే చెప్పులు నెత్తిన పెట్టుకుంటానని సవాల్ విసిరారు.ఆ  రెండు స్థానాల్లో గెలిచి చూపించాలని అన్నారు.  సీమాంధ్రులను కేసీఆర్‌ తిడితే కేటీఆర్‌ బుజ్జగిస్తున్నారని... ఇద్దరు కలిసి వారిని ఏమార్చే పని చేస్తున్నారని విమర్శించారు. ఇక కేటీఆర్‌ సీఎం కావాలన్న కల కలగానే మిగలడం ఖాయమని రాములు నాయక్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు

కాంగ్రెస్ గూటికి రాములు నాయక్:రేపు రాహుల్ సమక్షంలో పార్టీ తీర్థం

నాలాగే టీఆర్ఎస్‌లో చాలా మంది: ఏడ్చిన రాములు నాయక్

రాములు నాయక్‌ ‌పై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు

టీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ రాములు నాయక్

కేటీఆర్ బచ్చా కాదు అచ్చా మంత్రి.....ఎమ్మెల్సీ రాములు నాయక్

click me!