డీసీసీ అధ్యక్షుల ఎంపికకు వారే సిఫారసు చేయాలి: ఉత్తమ్

By narsimha lodeFirst Published Jan 4, 2019, 6:59 PM IST
Highlights

 రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ  ప్రయత్నాలను ప్రారంభించింది. డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం  కసరత్తు చేస్తోంది.


హైదరాబాద్:  రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ  ప్రయత్నాలను ప్రారంభించింది. డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం  కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు ఆ పార్టీ నాయకులు  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు సమావేశమయ్యారు.
డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయమై చర్చించారు.  జనవరి 14వ తేదీ లోపుగా బూత్, మండల, బ్లాక్ స్థాయి కమిటీలను పూర్తి చేయాలని   కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.

డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం  ఇటీవల అసెంబ్లీ స్థానాలకు పోటీ  చేసిన  అభ్యర్థులు  సిఫారసు చేయాలని పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమిష్టిగా పనిచేయాలని  ఉత్తమ్ పార్టీ నేతలను కోరారు.

ఓటర్ల నమోదు కోసం  ఈసీ  జనవరి 5వ తేదీ వరకు గడువు ఇచ్చారు.ఓటర్ల నమోదులో  కాంగ్రెస్ పార్టీ నేతలు చురుకుగా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్  ఆదేశించారు.

సంబంధిత వార్తలు

ఓటమి ఎఫెక్ట్: ఢిల్లీకి ఉత్తమ్, డీసీసీలకు కొత్త ముఖాలు

చెప్పినా ఉత్తమ్, రమణ వినలేదు: ఓటమిపై కోదండరామ్

ఉత్తమ్‌కు ఓటమి దెబ్బ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: న్యాయ పోరాటానికి కాంగ్రెస్

తెలంగాణలో ఓటమిపై పార్టీ నేతలతో కుంతియా సమీక్ష

ఓటమిపై పోస్ట్‌మార్టమ్: ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు, ఇక ప్రక్షాళన

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

 

 

click me!