మంత్రి పదవులు ఎన్నికలకు ముందే ఫిక్సయ్యాయి: కేటీఆర్

Published : Jan 04, 2019, 04:37 PM IST
మంత్రి పదవులు ఎన్నికలకు ముందే ఫిక్సయ్యాయి: కేటీఆర్

సారాంశం

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన తెలంగాణ ప్రజలు ప్రత్యర్థి పార్టీలకు చక్కటి గుణపాఠం చెప్పారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థానికంగా వున్న వాస్తవాలను, ప్రజల ఆలోచనను గుర్తించకుండా తమ కూటమిదే విజయమని విర్రవీగి కాంగ్రెస్ పార్టీ అవమానం పాలయ్యిందన్నారు. తెలంగాణలో ఇక తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని భావించిన కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులను కూడా పంచుకున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.   

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముందస్తు ఎన్నికలకు వెళ్లవద్దని కేసీఆర్ కు చాలా మంది సూచించారని...కానీ ఆయన ఎవరి మాటా వినకుండా ముందుకెళ్లారని గుర్తు చేశారు. ప్రజానాడి తెలిసిన నాయకుడు కాబట్టే ఆయన అలా అంత దైర్యంగా ముందస్తుకు వెళ్ళి విజయం సాధించారని కేటీఆర్ ప్రశంసించారు. 

కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో నిశ్శబ్ధ విప్లవం వస్తుందని ప్రచారం చేసుకున్నారని...దానికి జవాభిస్తూ తాను శబ్ధ విప్లవమే వస్తుందన్నానని గుర్తు చేశారు. తాను అన్నట్లుగానే ప్రజలు భారీ శబ్ద  విప్లవాన్ని సృష్టించారన్నారు. ఈ దెబ్బకు కొందరు కాంగ్రెస్ నాయకులు మీడియాకు ముఖం చాటేశారని...మరింకొందరు రాజకీయాల నుండి రిటైర్మెంట్ కు సిద్దమయ్యారని కేటీఆర్ పేర్కొన్నారు. 

కేవలం ట్రక్కు గుర్తు వల్లే కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ గెలుపొందాడని కేటీఆర్ అన్నారు. ఇక మిగతా పార్టీలు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాయని...జాతీయ పార్టీగా చెప్పుకునే బిజేపీ అయితే వంద సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. పంచాయితీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కనీసం పోటీచేసే పరిస్థితి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu