గాంధీభవన్ లో అడుగుపెట్టిన విజయశాంతి: కేసీఆర్ తో ఢీకి రెఢీ

Published : Sep 29, 2018, 04:27 PM ISTUpdated : Sep 29, 2018, 04:47 PM IST
గాంధీభవన్ లో అడుగుపెట్టిన విజయశాంతి: కేసీఆర్ తో ఢీకి రెఢీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు సినీనటి విజయశాంతి తొలిసారిగా గాంధీభవన్ లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సమావేశానికి హాజరైన విజయశాంతి ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 

 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు సినీనటి విజయశాంతి తొలిసారిగా గాంధీభవన్ లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సమావేశానికి హాజరైన విజయశాంతి ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 2014 ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న విజయశాంతి తొలిసారిగా స్టార్ కాంపైనర్ హోదాలో గాంధీభవన్ లో అడుగుపెట్టారు.  

టీపీసీసీ ప్రచారక కమిటీ తొలిసమావేశానికి హాజరైన ఆమెకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ముందస్తు ఎన్నికలను ఒక యుద్ధంగా విజయశాంతి అభివర్ణించారు. తాము యుద్ధానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. అన్నా చెల్లెల్ల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. కేసీఆర్ పరీక్ష రాశారని ఫలితం తర్వాత చెప్తానన్నారు. 

మరోవైపు తనకు ఎలాంటి గుర్తింపు ఉండటం లేదని ఆరోపిస్తూ నాలుగున్నరేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రాములమ్మకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ కమిటీలో స్థానం కల్పించింది.  పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయశాంతిని స్టార్ కాంపెయినర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించింది. 

విజయశాంతి రాకతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. స్టార్ కాంపైనర్ గా విజయశాంతిని రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళికలు రచిస్తోంది ప్రచారకమిటీ. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో సానుభూతి ఉందని అందుకు నటి విజయశాంతి ప్రచారం తోడైతే పార్టీ గెలుపుకు ఎంతోదోహదపడుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. 

మరోవైపు స్టార్ కాంపెయినర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన విజయశాంతి మహాకూటమి తరపున కూడా ప్రచారం చేస్తారా లేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నచోట మాత్రమే ప్రచారం చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్న రాములమ్మ టీడీపీ అభ్యర్థులు నిలబడినచోట కాంపెయిన్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.   

ఈ వార్తలు కూడా చదవండి

రంగంలోకి దిగిన అధిష్టానం: విజయశాంతికి బుజ్జగింపులు

టీడీపితో పొత్తుపై అసంతృప్తి: సాయంత్రం ఢిల్లీకి రాములమ్మ

రాములమ్మ అలిగారట ఎందుకంటే..

బాబుపై గరం: టీడీపితో పొత్తును వ్యతిరేకిస్తున్న రాములమ్మ

లాల్ దర్వాజ కాడ బోనమెత్తిన విజయశాంతి (ఫొటోలు)

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu