ప్రచారానికి 3 హెలికాప్టర్లు. సోనియా సభలు: మల్లు భట్టి విక్రమార్క

By Nagaraju TFirst Published Sep 29, 2018, 4:15 PM IST
Highlights

 తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో బహిరంగ సభలు, నియోజకవర్గాల స్థాయిలో సభలపై నిర్ణయం ప్రకటించింది. గాంధీభవన్ లో సమావేశమైన ఎన్నికల ప్రచార కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో బహిరంగ సభలు, నియోజకవర్గాల స్థాయిలో సభలపై నిర్ణయం ప్రకటించింది. గాంధీభవన్ లో సమావేశమైన ఎన్నికల ప్రచార కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 70 సభలు నిర్వహించాలని నిర్ణయించింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో 3బహిరంగ సభలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో 10 బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 

అలాగే కర్ణాటక రాష్ట్రం తరహాలో చిన్న చిన్న సభలు నిర్వహించాలని ప్రచార కమిటీ భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారానికి మూడు హెలికాప్టర్లు వినియోగించాలని నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, ఇతర జాతీయ నేతలకు కలిసి మూడు హెలికాప్టర్లను వినియోగించనున్నట్లు సమాచారం.  

మరోవైపు టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉంటుందని ప్రచార కమిటీ కో చైర్మన్ డీకే అరుణ తెలిపారు. బానిసత్వం నుంచి ప్రజలను బయటకు తీసుకువస్తామని తెలిపారు. అందుకు ఉద్యోగులు నిరుద్యోగులు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. 
 

click me!