జగిత్యాల: సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో భోజనం వికటించి... 25మంది విద్యార్థిణులకు తీవ్ర అస్వస్థత (Video)

By Arun Kumar P  |  First Published Dec 14, 2021, 1:51 PM IST

జగిత్యాల పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సోమవారం రాత్రి భోజనం వికటించి 25మంది విద్యార్థిణులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 


జగిత్యాల: సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో (telangana social welfare hostel) ఒకేసారి చాలామంది విద్యార్థిణులు అస్వస్థతకు గురయి హాస్పిటల్ పాలయిన ఘటన జగిత్యాల జిల్లా (jagitial disstrict)లో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థిణులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇలా జగిత్యాలలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిణులు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందారు. 

జగిత్యాల పట్టణంలోని భవాని నగర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వుంటూ చాలామంది నిరుపేద విద్యార్థిణులు చదువుకుంటున్నారు. అయితే సోమవారం రాత్రి హాస్టల్లో వండిన ఆహార పదార్థాలు తిని విద్యార్థిణులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసినతర్వాత అమ్మాయిలు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. 

Latest Videos

undefined

Video

ఇలా రాత్రి విద్యార్థిణులు అస్వస్థతకు గురయినట్లు తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని జగిత్యాల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురయిన 25 మందితో పాటు మరో 50 మంది విద్యార్థినులను మంగళవారం తెల్లవారుజామున హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థినులను హాస్టల్ కు తరలించారు. 

read more  దారుణం: భార్యాభర్తల మధ్య గొడవలు... ఇద్దరు పిల్లలకి ఉరేసి, తల్లి ఆత్మహత్య

ప్రస్తుతం విద్యార్థిణులందరి పరిస్థితి మెరుగ్గానే వుందని... ఎవరికి ఎలాంటి ప్రమాదం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది కోలుకుని హాస్టల్ కు తిరిగివెళ్లారు. మిగతావారికి చికిత్స కొనసాగిస్తున్నామని... వారు కూడా కోలుకుంటున్నారని హాస్టల్ సిబ్బంది తెలిపారు. 

అయితే ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డాడు. హాస్టల్ సిబ్బందితో మట్లాడి విద్యార్థిణుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థిణుల అనారోగ్యానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. 

ఇదిలావుంటే ఇటీవల కృష్ణా జిల్లా మచిలీపట్నంలో (machilipatnam)లో కూడా ఇలాగే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో  ఒకే రోజు 14 మంది చిన్నారుల్లో తీవ్ర జ్వరం (High fever), జలుబు లక్షణాలు కనిపించడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

read more  పురుటి నొప్పులతో ఆస్పత్రికి వెడితే.. కడుపులో బట్టపెట్టి కుట్టేసిన డాక్టర్లు..

గురుకుల పాఠశాల సమీపంలోని మురికి నీళ్ల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి తల్లిదండ్రులు చెప్పారు. అక్కడ పెద్ద ఎత్తున దోమలు, పందులు చేరడంతోనే ఇలా జరిగి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో విష జ్వరాలు (viral fevers) విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు అంతుచిక్కని జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం (koyyalagudem) మండలం బోడిగూడెంలో (bodigudem) అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి.  దాదాపు 50 మందికి పైగా పిల్లలు ఫీవర్స్‌ బారినపడ్డారు. ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ఇలా హటాత్తుగా విద్యార్థులు, చిన్నారుల అస్వస్థత ఘటనలు పెరిగిపోవడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విషజ్వరాలు, సీజనల్ వ్యాధుల భారిన చిన్నారులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

click me!