
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ పై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లోని అంత:కలహాలపై జగ్గా రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది.
ఛత్తీస్‌గడ్ వ్యవహారాలపై సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. 15 నిమిషాల ఈ సమావేశంపై జగ్గారెడ్డి సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అనంతరం, ఆయన ఢిల్లీ నుంచి తెలంగాణకు బయల్దేరారు. అయితే, ఈ భేటీ గురించి జగ్గా రెడ్డి ఏమీ చెప్పలేదు.
Also Read: మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి భేటీ:జూలై 2న ఖమ్మం సభపై చర్చ
తెలంగాణ కాంగ్రెస్‌లోని అంతర్గత వర్గ పోరు గురించి జగ్గా రెడ్డి రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలిసింది. ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు వ్యతిరేక ప్రచారం చేసుకుంటున్నారని జగ్గారెడ్డి చెప్పినట్టు సమాచారం. తద్వార పార్టీ నష్టపోతున్నదని తెలియజేసినట్టు తెలిసింది. అయితే, రాహుల్ గాంధీ ఈ ఆరోపణలను ఆలకించి.. వాటిపై లోతుగా చర్చించలేదని తెలుస్తున్నది. కానీ, సమిష్టిగా పోరాడాలని, వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగ్గారెడ్డికి ఆయన సూచించినట్టు తెలిసింది.