
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేపై సీరియస్ కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు పోడు భూముల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ నడుచుకుంటూ సభా ప్రాంగణానికి వస్తున్నారు.
ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరిగెత్తుకుంటూ వచ్చి కేటీఆర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి మంత్రి దీనికి ఏమాత్రం స్పందించకపోగా.. శంకర్ నాయక్ చేతిని పక్కకు తోసేశారు. దీంతో ఎమ్మెల్యే చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వెళ్లారు. అయితే శంకర్ నాయక్‌పై కేటీఆర్ ఎందుకు సీరియస్ అయ్యారోనని బీఆర్ఎస్‌తో పాటు ఇతర పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శంకర్ నాయక్ చేతిని కేటీఆర్ నెట్టేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.