ఉత్తమ్‌కు ఓటమి దెబ్బ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు?

By narsimha lodeFirst Published Jan 1, 2019, 3:55 PM IST
Highlights

 తెలంగాణ పీసీసీ చీఫ్‌‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.  ఈ ఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ను  ఈ బాధ్యతల నుండి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్‌‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.  ఈ ఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ను  ఈ బాధ్యతల నుండి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.

 రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కొనసాగించారు.  రాహుల్ గాంధీ  పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడ  పూర్తైంది. 

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు  జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఆ సమయంలో  పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కొనసాగించారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

పార్లమెంట్ ఎన్నికల వరకు ఉత్తమ్ ‌కుమార్ రెడ్డి ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. కానీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్  పదవిలో  మార్పు ఉండే అవకాశం లేకపోలేదు.

రాష్ట్రంలో రెండో దఫా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేళ్ల పాటు పార్టీని  సమర్థవంతంగా నడపాల్సిన అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.. టీఆర్ఎస్‌ దూకుడును తట్టుకొంటూ  కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా  నడిపే నాయకులు అవసరం ఉందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌‌గా మధుయాష్కీ లేదా  రేవంత్ రెడ్డికి  పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.మధుయాష్కీ గతంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.ఎఐసీసీ కార్యదర్శిగా కూడ యాష్కీ పనిచేస్తున్నారు.యాష్కీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. 

ఈ తరుణంలో  మధుయాష్కీ లేదా  రేవంత్ రెడ్డిలలో ఎవరో ఒకరికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేల్లో  కొందరు టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారనే ప్రచారంలో ఉంది.

తెలంగాణ శాసనసభలో  కూడ  కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలనే వ్యూహంతో కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.ఇదంతా ఆ పార్టీ వర్గాల్లో కొంత గందరగోళానికి  తావిస్తోంది. ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనమైంది.. 

రాజకీయాల్లో అవసరమైన సమయాల్లో అవసరానికి తగ్గట్టుగా  నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలను  దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో నూతనోత్తేజాన్ని నింపే నాయకుడికి పీసీసీ పగ్గాలను ఇచ్చే  అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: న్యాయ పోరాటానికి కాంగ్రెస్

తెలంగాణలో ఓటమిపై పార్టీ నేతలతో కుంతియా సమీక్ష

ఓటమిపై పోస్ట్‌మార్టమ్: ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు, ఇక ప్రక్షాళన

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

click me!