సీఎంను అందుకే కలుస్తున్నాం: క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

By Arun Kumar PFirst Published Jan 1, 2019, 2:53 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు. వీరి మాదిరిగానే ఇటీవలే కాంగ్రెస్ తరపును గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్దంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

ముఖ్యంగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోడానికి సిద్దంగా వున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు తాము సీఎం కేసీఆర్ ను కలవనున్నట్లు వారు ఇటీవల ప్రకటించారు. దీంతో పార్టీలో చేర్చుకోడానికు సీఎం వారితో చర్చలు జరుపనున్నట్లు ప్రచారం జోరందుకుంది. రాజకీయ దుమారం రేగడంతో ఇలా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో శ్రీధర్ బాబు, గండ్ర వివరణ ఇచ్చారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన నిమిత్తం జిల్లాకు వస్తుండటంతో మర్యాదపూర్వకంగా కలుస్తామని ప్రకటించామని అన్నారు. దీంతో తామేదో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికే సీఎంను కలుస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడబోమని శ్రీధర్ బాబు, గండ్ర  వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం రీడిజైనింగ్పపై గతంలో చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నామని  తెలిపారు.

ఇవాళ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించనున్నారు. అందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ లో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరిగే జిల్లాల్లో  పర్యటించనున్నారు. మేటిగడ్డ, సుందిళ్ల అన్నారం, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం, రాజేశ్వరరావుపేట,రాంపూర్ లలో జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఇలా రెండు రోజులు పాటు సీఎం పర్యటన కొనసాగనుంది.  ఈ పర్యటన సందర్భంగానే తమ జిల్లాలకు సీఎం వస్తుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలుస్తామంటూ ప్రకటించారు.  

click me!