కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా

Published : Jan 01, 2019, 03:21 PM ISTUpdated : Jan 01, 2019, 03:52 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా

సారాంశం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం కీలక పరిణామం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనార్థం మేడిగడ్డ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.    

భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం కీలక పరిణామం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనార్థం మేడిగడ్డ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.   

ప్రాజెక్టు సందర్శనార్థం మేడిగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్ ను  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డిలు కేసీఆర్ ను కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై ఎమ్మెల్యేలు కేసీఆర్ కు వినతిపత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ప్రతీ ఎకరాకు నీరు అందిస్తామన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విపక్షంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధిపై సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయమే లక్ష్యంగా అంతా కలిసి పనిచెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!