ఎందుకో తెలీదు...కేటీఆర్, కవితలకు అడ్డుగా ఉన్నాననే....: విజయశాంతి

By Arun Kumar PFirst Published Oct 1, 2018, 6:38 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీలో నుండి తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ తనకు తెలియడంలేదని మాజీ ఎంపి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. అయితే ఆనాటి పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ తన వారసులు కేటీఆర్, కవితలకు అడ్డుగా వస్తానేమోనని అనుమానంతోనే సస్పెండ్ చేసి ఉంటాడని భావిస్తున్నట్లు విజయశాంతి వెల్లడించారు. 

ఇక తెలంగాణ లో ప్రస్తుతం ఎన్నికల వేడి మొదలై...ఆశావహులంతా పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే విజయశాంతి మాత్రం సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. కానీ కాం్గరెస్ పార్టీ గెలుపు కోసం మాత్రం విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 430 మండలాల్లో ప్రచారం చేస్తానని పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకి చెప్పానని...ఆ మాటను నిలబెట్టుకుంటానని విజయశాంతి స్పష్టం చేశారు. 

సోమవారం మీడియాతో మాట్లాడిన విజయశాంతి.... కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో చేరడానికి ఏ పార్టీ ఒప్పుకోవడం లేదని అన్నారు. అయినా కేసీఆర్ ఇతర పార్టీలను అవమానిస్తూ మాట్లాడటం ఆపడం లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీపై, ఈ నాలుగేళ్ల పాలనపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉందని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం తన శాయశక్తుల ప్రయత్నిస్తానని విజయశాంతి తెలిపారు. 

సంబంధిత వార్తలు

పోటీకి రాములమ్మ దూరం: టార్గెట్ కేసిఆర్

విజయశాంతి పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే...

గాంధీభవన్ లో అడుగుపెట్టిన విజయశాంతి: కేసీఆర్ తో ఢీకి రెఢీ

రాములమ్మకు పదవొచ్చిందోచ్

నాయిని మాటలను తిప్పి కొట్టిన విజయశాంతి

click me!