జగిత్యాల ప్రేమదేశం కథ: ఇద్దరమ్మాయిలతో చాటింగ్, ప్లాన్‌తోనే ఆత్మహత్యలు

Published : Oct 01, 2018, 06:08 PM ISTUpdated : Oct 01, 2018, 06:20 PM IST
జగిత్యాల ప్రేమదేశం కథ: ఇద్దరమ్మాయిలతో చాటింగ్, ప్లాన్‌తోనే ఆత్మహత్యలు

సారాంశం

జగిత్యాలలో టెన్త్ విద్యార్థుల సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఇద్దరు విద్యార్థులు కూడ మరో ఇద్దరు అమ్మాయిలతో చాటింగ్ చేసేవారని పోలీసులు గుర్తించారు.


జగిత్యాల: జగిత్యాలలో టెన్త్ విద్యార్థుల సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఇద్దరు విద్యార్థులు కూడ మరో ఇద్దరు అమ్మాయిలతో చాటింగ్ చేసేవారని పోలీసులు గుర్తించారు.అమ్మాయిలతో చాటింగ్ విషయం వారి ఇండ్లలో తెలిసిందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు కూడ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఈ కేసు విచారణ చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటరమణ చెప్పారు.

మహేందర్, రవితేజల స్నేహితులను విచారించి ప్రాథమికంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టు డీఎస్పీ చెప్పారు.  ఇదిలా ఉంటే మహేందర్, రవితేజలు పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి పెట్రోల్‌ను కొనుగోలు చేశారని పోలీసులు చెప్పారు.

పెట్రోల్ క్యాన్‌ను తీసుకొని వెళ్లినట్టు సీసీ పుటేజీని కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  మరో వైపు  రవితేజకు మత్తు పదార్ధాలు తీసుకోవడం అలవాటుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో  ఈ విషయమై తాము కౌన్సిలింగ్ ఇచ్చినట్టు చెప్పారు. కానీ, ఎలాంటి మార్పు రాలేదన్నారు.

బీరు కూడ  తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని డిఎస్పీ చెప్పారు. అయితే  వీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా ఆర్ఎక్స్ 100 సినిమా ప్రభావం కూడ ఉందనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేశారు

ఆత్మహత్య చేసుకోవడానికి ముందే ఈ విషయమై స్నేహితులతో  ఈ ఇద్దరు విద్యార్థులు ఈ విషయాన్ని చెప్పినట్టు గుర్తించామని  పోలీసులు తెలిపారు.  అయితే   ఈ విషయమై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

జగిత్యాల ప్రేమ దేశం కథలో ట్విస్ట్: ఆర్ఎక్స్ 100 ఎఫెక్ట్

జగిత్యాల ప్రేమ దేశం కథ: ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

ప్రేమదేశం సినిమా తరహాలో ఒక అమ్మాయి కోసం... (వీడియో)

టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు