ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి: చొక్కా విప్పి రిలాక్స్ అయిన బాలకృష్ణ

Published : Oct 01, 2018, 05:45 PM IST
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి: చొక్కా విప్పి రిలాక్స్ అయిన బాలకృష్ణ

సారాంశం

 హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఖమ్మం జిల్లా వినూత్న రీతిలో జరిగింది. అభిమానుల తాకిడితో లేక భానుడి భగభగతో తెలియదు కానీ బాలయ్య మాత్రం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ ఉక్కపోతను తట్టుకోలేక బాలయ్య షర్ట్ విప్పేసి కాస్త రిలాక్స్ అయ్యారు. 

ఖమ్మం: హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఖమ్మం జిల్లా వినూత్న రీతిలో జరిగింది. అభిమానుల తాకిడితో లేక భానుడి భగభగతో తెలియదు కానీ బాలయ్య మాత్రం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ ఉక్కపోతను తట్టుకోలేక బాలయ్య షర్ట్ విప్పేసి కాస్త రిలాక్స్ అయ్యారు. అంతేకాదు అదే బనీయన్ తో పర్యటించారు. అభిమానులందరికీ బనియన్ తోనే అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

ఉదయం ఖమ్మం జిల్లా చేరుకున్న బాలయ్యకు టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత రాయపట్నం, దెందుకూరు, ఆళ్లపాడులో దివంగత సీఎం ఎన్టీఆర్‌ విగ్రహాలను బాలకృష్ణ ఆవిష్కరించారు. 

నాన్నగారి విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. తెలుగు వైభవం మళ్ళీ మొదలయ్యేరోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు.  టీడీపీకి ఉన్న నిబద్దత కలిగిన కార్యకర్తలు ఏ పార్టీకీ లేరని బాలయ్య స్పష్టం చేశారు.  
 
ముండుటెండల్లో ఎంతమంది పాదయాత్రలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి...నేటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మండు టెండల్లో సైతం పాదయాత్రలు చేశారు. గొడగు వేసుకోవడమో, టవల్ ను తలపాగా కట్టుకోవడమో చేశారు కానీ ఇలా షర్ట్ విప్పేసి బనియన్స్ తో యాత్రలు చెయ్యలేదని కొందరు గుసగుసలాడుకున్నారు.   

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు