అలా చేస్తే మా ఆత్మ గౌరవం దెబ్బతింటుంది: రేవంత్‌పై వీహెచ్ పరోక్ష విమర్శలు

By narsimha lodeFirst Published Jun 13, 2021, 1:42 PM IST
Highlights

నిన్న మొన్న పార్టీలోకి వచ్చినవారికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే మా ఆత్మగౌరవం దెబ్బతింటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు చెప్పారు. 
 

హైదరాబాద్:నిన్న మొన్న పార్టీలోకి వచ్చినవారికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే మా ఆత్మగౌరవం దెబ్బతింటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు చెప్పారు. ఆదివారంనాడు  కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత  వి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. పార్టీలో మొదటి నుండి ఉన్న విశ్వాసపాత్రులకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్నారు. 

also read:తెలంగాణ కాంగ్రెస్ నేతల హస్తిన టూర్: టీపీసీసీకి కొత్త బాస్‌ ఎంపిక తేలేనా?

కర్ణాటకలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం పరిశీలకుడిని పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పంజాబ్ లో కూడ అదే జరుగుతోందన్నారు.  తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఎందుకు పరిశీలకుడిని పంపడం లేదని ఆయన ప్రశ్నించారు. తనను పార్టీ నుండి పంపేందుకు పొగబెడుతున్నారని ఆయన ఆరోపించారు.  టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి దక్కకుండా అడ్డుకొనేందుకు వి. హనుంతరావు చివరి వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే  పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఢిల్లీ టూర్‌  పార్టీలో చర్చ సాగుతోంది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకొందనే నేపథ్యంలో  పార్టీ నేతలు ఢిల్లీ టూర్ చేపట్టారనే ప్రచారం కూడ నెలకొంది. 
 

click me!