మాజీ మంత్రి ఈటలతో పాటే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పి ఛైర్ పర్సన్ తుల ఉమతో పాటు కీలక నాయకులు టీఆర్ఎస్ ను వీడగా రెండో శ్రేణి నాయకులు కూడా పార్టీని వీడటం ప్రారంభించారు.
హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పి ఛైర్ పర్సన్ తుల ఉమతో పాటు కీలక నాయకులు టీఆర్ఎస్ ను వీడగా రెండో శ్రేణి నాయకులు కూడా పార్టీని వీడటం ప్రారంభించారు. ఇలా తాజాగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలానికి చేందిన 13 మంది ఉప సర్పంచులు ఈటలకు మద్దతు ప్రకటిస్తూ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడమే కాదు పార్టీ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించిన ఈటలను అవమానకరంగా మంత్రిమండలి నుండి తొలగించడం దారుణమని ఉప సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. అందువల్లే ఈటల పార్టీని వీడటంతో ఆయన మద్దతుగా నిలవాలని తాము కూడా రాజీనామా చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.
undefined
read more స్పీకర్ కరోనాను అడ్డం పెట్టుకున్నారు : రాజీనామా సమర్పణపై ఈటల (వీడియో)
ఇదిలావుంటే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందజేయగా సాయంత్రమే ఆ రాజీనామాను అంగీకరించారు. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. దీంతో టీఆర్ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల. ఈ సందర్భంగా... 17 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, యావత్ తెలంగాణ ప్రజల కోసం తాను రాజీనామా చేస్తున్నానని ఈటల చెప్పారు.